ఈ మద్య కాలంలో జంక్ ఫుడ్ వినియోగం ఎక్కువైపోయింది. ఆన్లైన్ ఫుడ్ అప్స్ వచ్చిన తరువాత, సులభంగా ఆహరం ఆర్డర్ చేసుకునే సౌలభ్యం ఉండటంతో జంక్ ఫుడ్ కి బానిసలుగా మారుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంకంటే జంక్ ఫుడ్ ఆకర్షణీయంగా, మరియు రుచిగా ఉంటుంది, ప్రస్తుతం బాగానే ఉన్నా దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్ వినియోగం తగ్గించాలని డాక్టర్లు మరియు ఆహారానిపుణులు హెచ్చరిస్తున్న సరే వారి మాట పెడచెవిన పెట్టి, జంక్ ఫుడ్ ఆర్జిస్తున్నారు కొందరు. జంక్ ఫుడ్ ఎందుకంత ప్రమాదకరమో ఇప్పుడు తెల్సుకుందాం.
జంక్ ఫుడ్స్ లో అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ ఎంతో హానికరమైనవి. వీటిని తరచూ తినేవారిలో జీవితకాలం తగ్గిపోతుందని కొన్ని ఆదాయనాల్లో తేలింది. అమెరికాలో గత 34ఏళ్లుగా నిర్వహిస్తున్న ఒక పరిశోధనలో 44 వేల మంది ఆహార పద్దతులను గమనిస్తూ, వారి ఆహార అలవాట్ల గురించి నిశితమైన సమాచారం సేకరిస్తున్నారు, ఈ అధ్యనం ద్వారా జంక్ ఫుడ్స్ మరియు అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ తరచు తినేవారిలో, తక్కువ వయసులోనే మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది. ఈ అధ్యనానికి సంబంధించిన పూర్తి వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు.
కాకపోతే ఇది పరిశీలనాత్మక అధ్యనం కనుక అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినేవారిలో త్వరగా మరణం సంభవిస్తుందని పరిశోధకులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. అసలు అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, మనకి షాపుల్లో దొరికే చిప్స్ పాకెట్స్, బిస్కెట్ పాకెట్స్, నూడుల్స్, ఇన్స్టంట్ సూప్స్, మరియు కూల్ డ్రింక్స్ వంటి వాటిని అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఇటువంటి ఆహారంలో కొవ్వు, చెక్కర, ఉప్పు మరియు ఇతర కుత్రిమ మూలకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వలన శరీరంలో చెక్కర లెవెల్స్ అధికంగా పెరుగుతాయి.
రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి, కిడ్నీలో రాళ్ళూ రావడానికి, జంక్ ఫుడ్స్ కారణం కావచ్చు. ఇటువంటి ఆహారం తినకపోవడం, లేదంటే తగ్గించడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. పొట్ట నింపుకోవడానికి జంక్ ఫుడ్స్ తినే బదులు, తృణ ధాన్యాలు, పళ్ళు, కాయగూరలు తినడం చాల ఉత్తమం. ఇవి ఆకలి తీర్చడంతో పాటు, ఆరోగ్యంగా జీవితాన్ని జీవించేందుకు తోడ్పడతాయి.
Share your comments