సాధారణంగా మన రోజువారీ ఆహారంలో భాగంగా మధ్యాహ్నం లేదా రాత్రి ఖచ్చితంగా పెరుగుతోనే మనం భోజనాన్ని ముగిస్తాము. పెరుగులో ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల మనకు అనేక ఆరోగ్యప్రయోజనాలను కల్పిస్తుంది.పాలను బాగా మరిగించి గోరువెచ్చని పాలలోకి కొద్దిగా పెరుగు వేయటం వల్ల మనకు పాలు మొత్తం పెరుగుగా మారుతుంది. ఈ క్రమంలోని పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
ఈ బ్యాక్టీరియా మనకు హాని కలిగించేది కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను అందించే బ్యాక్టీరియా అని చెప్పవచ్చు. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ బ్యాక్టీరియా ఎంతగానో దోహదపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి పెరుగును చాలామంది తినడానికి ఇష్టపడరు.పెరుగును తినడానికి ఇష్టపడిన వారు ఈ విషయాల గురించి తెలిస్తే తప్పకుండా పెరుగుని తినడం అలవాటు చేసుకుంటారని చెప్పవచ్చు.
సాధారణంగా కేవలం పెరుగుతో మాత్రమే భోజనం చేయడం వల్ల మన శరీర బరువు పెరుగుతారని చాలామంది భావిస్తుంటారు. అయితే పెరుగుతో పాటు కొద్దిగా జీలకర్ర, ఉప్పు, వంటి వాటిని ఉపయోగించి పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా ఎసిడిటీ గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలతో బాధపడేవారు కొద్దిగా పెరుగులోకి నీటిని కలిపి కాస్త ఉప్పు వేసుకొని తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.
అలాగే బలహీనంగా నీరసంగా ఉన్నవారు పెరుగులోకి కొద్దిగా చక్కెర కలుపుకుని తాగడం ద్వారా నీరసం నుంచి విముక్తి పొంది తొందరగా శక్తిని పొందుతాము. అలాగే నోటి పూత దంత సమస్యలతో బాధపడేవారు పెరుగులో కొద్దిగా వాము కలుపుకుని తినడం ద్వారా దంత సమస్యలు నోటి పూత వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.మనం తీసుకునే పెరుగులోకి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవటం వల్ల మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. అదేవిధంగా పెరుగుని తినడం వల్ల మన శరీరంలో ప్రో బయోటిక్ బ్యాక్టీరియాను రక్షించడానికి దోహదపడుతుంది. కనుక పెరుగును తప్పనిసరిగా మా రోజు వారి ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Share your comments