మనిషి శరీరం 70% నీటిని కలిగి ఉంటుంది. మన శరీరంలో జరిగే ఎన్నో ప్రక్రియలకు నీరు అత్యంత కీలకం అయ్యింది. ప్రతి రోజు సరైన మొత్తంలో నీటిని తాగడం వాళ్ళ ఎన్నో రోగాలను అరికట్టవచ్చు. ఈ భూమి మీద నివసించే ప్రతి జీవికి నీరు జీవనాధారం. ఒక మనిషి ఆహరం లేకుండా బ్రతకగలడు ఏమో కానీ నీరు లేకుండా బ్రతకలేదు అనేది వాస్తవం. నీటిని తాగడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తేలుసుకుందాం.
ఒక మనిషికి సగటున ఒక రోజుకి 4 లీటర్ల నీరు అవసరం. నీరు శరీరంలోని వేడిని తగ్గించి శరీర ఉష్ణోగ్రత నియంత్రించడంలో తోడ్పడుతుంది. మనిషికి అతి ముఖ్యమైన కాళ్లను ఎల్లపుడు తేమతో ఉంచడం లోను అలాగే ఆహరం జీర్ణం అయ్యేందుకు లాలాజల్లని ఉత్పత్తి చేయడంలోనూ నీరు తన పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా నీళ్లు తాగే వాళ్లలో శరీర సౌందర్యాన్ని పెంచి చర్మ వ్యాధులు దగ్గరకి రాకుండా సహాయపడుతుంది.
ముఖ్యంగా మనిషి యొక్క మెదడు పనితీరులోనూ నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది అని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా శరీరానికి ఎంతగానో అవసరమయ్యాయే ప్రాణవాయివు (ఆక్సిజన్ ) ను సరఫరా చేయడంలోనూ నీరు తన వంతు సాయం చేస్తుంది. మనం రోజు తీసుకునే ఆహరం అరగడానికి అలాగే జీర్ణవ్యవస్థ లో సజావుగా సాగడానికి నీరు ఎంతగానో అవసరం. మన రక్తంలోను ఇంకా శరీరం లో ఉండే మలినాలను మూత్రం ద్వారా బయటకి పంపించడం లో తోడ్పడుతుంది
మూత్రపి0డాలలో రాళ్ళూ రావడానికి ముఖ్య కారణం సర్రిగ్గా నీళ్లు తీసుకోకపోవడమే. సమపాళ్లలో నీళ్లు తాగడం వాళ్ళ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఈదిన మితంగా తీసుకుంటే అమృతం అమితంగా తీసుకుంటే విషం, ఈ విషయాన్ని దృస్ధి లో ఉంచుకుని నీటిని కూడా అవసరమయిన మేరకు తీసుకోవాలి. మనం రోజు తినే పండ్లు, కూరగాయలు, అన్నం లో కూడా నీరు ఉంటుంది అని గుర్తు పెట్టుకోండి
Share your comments