మన చుట్టూ ఉండే చెట్లు సాధారణంగా కనిపించిన వాటిలో ఎనలేని ఔషధవిలువలు ఉంటాయి. కొన్ని రకాల మొక్కలు కలుపు మొక్కలుగా కనిపించినా వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుంటే మాత్రం, నివ్వెరపోవాల్సిందే. ప్రజలు ఆయుర్వేద వైద్యం మీద ఎక్కువుగా ఆధారపడి రోజుల్లో ఈ మొక్కలను ఎంతో ప్రత్యేకంగా భావించి, వాటిని సంరక్షించేవారు. అయితే కాలం మారుతున్నకొద్దీ, ప్రజలు ఆయుర్వేదం మందులు వాడటం తగ్గించేశారు, దీనితోనే ఔషధ మొక్కలకు ఉన్న విలువ తగ్గుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం రసాయన మందుల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ గుర్తించిన ప్రజలు మల్లి ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు, దీనితో ఆయుర్వేద వైద్యానికి తిరిగి మల్లి పూర్వవైభవం వచ్చిందని చెప్పవచ్చు.
మన చుట్టూ పక్కల సాధారణంగా కనిపించే మొక్కల్లో నల్లతుమ్మ చెట్టు ఒకటి. పసుపు రంగు పూలు, నల్లటి బెరడు, మరియు పొడవాటి కాయల ఆదారంగా వీటిని గుర్తించవచ్చు. ఇవి ఎక్కువుగా పొలం గట్ల మీద మరియు రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా కనిపించే ఈ చెట్టులో అసాధారణమైన పోషక విలువలు ఉంటాయి. అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టు ఎన్నో రోగాలను నయం చెయ్యడంలో సహాయపడుతుంది. ఈ చెట్టు నుండి వచ్చే కలప నుండి ఎన్నో రకాల వస్తువులు తయారుచేస్తారు. ఈ చెట్టు యొక్క కాయలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గించడంలో సహాయం చేస్తాయి.
వెన్ను నొప్పిని తగ్గిస్తుంది:
వయసు పైబడే కొద్దీ వెన్నునొప్పి సమస్యలు ఎక్కువవుతాయి, దీనితోపాటు మోకాళ్ళ నొప్పులు మరియు ఎముకల సమస్యలు కూడా రావడం గమనించవచ్చు. ఇటువంటి సమస్యలన్నిటికీ నల్లతుమ్మ చెట్టు పరిష్కారం చూపుతుంది. చెట్టు యొక్క బెరడు, గింజలు మరియు చెట్టు జిగురును ముద్దలాగా చేసుకొని ప్రతిరోజు తీసుకుంటే వెన్నముక సమస్యలు దూరమవుతాయి. ఈ చెట్టు బెరడును పొడిలాగా చేసుకొని పాలల్లో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు మరియు ఎముకల సమస్యలు దూరమవుతాయి.
స్త్రీలలో నెలసరి సమస్యలు మాయం:
స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి, నల్ల తుమ్మ చెట్టు లేత ఆకులను జ్యూస్ లాగ చేసుకొని తాగాలి. ఈ బెరడును కాషాయం లాగా చేసుకొని తాగితే యోని శుభ్రమవుతుంది. దీనితో పాటు తెల్లజుట్టు సమస్య కూడా దూరమవుతుంది.
నోటి ఆరోగ్యం:
చాల మంది నోటికి సంబంధించిన వ్యాధులు మరియు నోటి దుర్వాసన వంటి సమస్యల పరిష్కారానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉంటారు, అటువంటి వారు నల్ల తుమ్మ బెరడు నుండి తయారుచేసిన కషాయాన్ని లేదంటే జిగురును, నోట్లు ఉంచుకొని కొద్దీసేపటి తరువాత బయటకి ఉమ్మెయ్యడం ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
శరీరం బలంగా మారడం:
నల్లతుమ్మ చెట్టు బెరడును పొడిలాగా చేసి ఉదయం మరియు సాయంత్రం నెయ్యితో కలిపి తీసుకుంటే శరీరం దృడంగా మారుతుంది. దీనితోపాటుగా రోగనిరోధక శక్తీ కూడా వృద్ధి చెందుతుంది.
డైయేరియా నుండి ఉపశమనం:
డైయేరియా తో బాధపడేవారు, నల్లతుమ్మ చెట్టు ఆకులు, వాము, జీలకర్ర, అన్నిటిని కలిపి కషాయంలాగా చేసుకొని తాగడం ద్వారా డైయేరియా సమస్య తగ్గుతుంది. ఈ చెట్టుఆకులను నూరి రెండుపూటలా తినడం ద్వారా రక్త మొల్లల సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా నల్లతుమ్మ చెట్టు నుండి ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు.
Share your comments