మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగడానికి, మనం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండటానికి విటమిన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మన ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి ఈ, బీ12 ఎంతో అవసరం. ఇందులో ఏ విటమిన్ లోపించిన మన శరీరం అనారోగ్య సమస్యల పాలవుతుంది. ముఖ్యంగా బీ12 విటమిన్ లోపించడం వల్ల అనేక సమస్యలు మనల్ని వెంటాడుతాయి. విటమిన్ బీ12 లోపం వల్ల ఎలాంటి లక్షణాలు, వ్యాధులు మనలో కనబడతాయో ఇక్కడ తెలుసుకుందాం...
మన శరీరానికి తగినంత విటమిన్ బీ12 లేకపోతే శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఈ క్రమంలోనే తరచూ అనారోగ్యానికి గురికావడం, రక్తహీనత ఆటో ట్రాఫిక్ వల్ల కడుపులో పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా ఈ విటమిన్ తక్కువగా ఉన్న వారిలో తరచు మద్యం తాగాలనే కోరిక కలుగుతుంది.
విటమిన్ బీ12 లోపం వల్ల తరచూ అలసిపోవడం, కండరాలు నొప్పి కలిగి ఉండటం, మతిమరుపు, చేతులు కాళ్లు తిమ్మిర్లు ఏర్పడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఆకలిగా లేకపోవటం, చర్మం పాలిపోవడం నాలుక రుచిని కోల్పోవడం వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ విధమైన లక్షణాలు మనలో కనబడితే తప్పకుండ మన శరీరానికి విటమిన్ బీ12 తక్కువగా ఉందని సంకేతం. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి విటమిన్ లోపం నుంచి బయటపడాలంటే తప్పకుండా అధికశాతం పోషక పదార్థాలు,విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.
Share your comments