యుక్త వయస్సు నుంచే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాయామం చేయడం మన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర గుండె జబ్బులు, మధుమేహం,రక్తపోటు ,ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.అలాగే మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.అయితే వ్యాయామం చేయడంలో చాలా మందికి అపోహలున్నాయి. ముఖ్యంగా లావుగా ఉన్నవారు మాత్రమే వ్యాయామం చేయాలి. సన్నగా ఉన్న వారికి వ్యాయామం అవసరం లేదు అన్న భావన చాలా మందిలో కలిగి ఉంది ఈ భావన ఎంత మాత్రం సమంజసం కాదు.
శారీరక శ్రమ కలిగిన వ్యాయామం చేయడం వలన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. శరీరంలో అధిక క్యాలరీలు కరగడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. కావున లావుగా ఉన్నవారే కాదు,సన్నగా ఉన్నవారు కూడా వ్యాయామం చేయడం అవసరమే. కాకపోతే వ్యాయామ పద్ధతుల్లో కొంత మార్పు ఉంటుంది.సన్నగా ఉన్నవాళ్లు కోచ్ సూచనల మేరకు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ముఖ్యంగా కార్డియో వర్కవుట్స్ కన్నా స్ట్రెంత్ ట్రైనింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి.
సన్నగా ఉన్నవాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే మనం తీసుకొనే ఆహారంతో పాటు సరి అయిన వ్యాయామం తప్పనిసరి అవుతుంది. ఇలాంటి వారు క్రమం తప్పక వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. ఒకేవిధమైన ఎక్సర్‌సైజ్‌లు కాకుండా కాంపౌడ్ ఎక్సర్ సైజ్ లు అంటే క్వాట్స్, డెడ్ లిప్ట్, బెచ్ ప్రెస్, స్కిప్పింగ్, డంబెల్ రో ఇలాంటివి ప్రయత్నించడం వల్ల కండరాలు గట్టిపడి శరీరాకృతి అందంగా తయారవుతుంది.
Share your comments