సాధారణంగా చాలామంది వారి ఆహార విషయంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల, గంటల తరబడి కూర్చుని పనులు చేయడం వల్ల తొందరగా శరీర బరువు పెరిగిపోతారు.వయసుకు తగ్గట్టు ఉండాల్సిన బరువు కన్నా అధిక శరీర బరువు ఉండటం వల్ల ఎన్నో సమస్యల బారినపడుతుంటారు. ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేయడమే కాకుండా కఠినమైన ఆహార నియమాలను కూడా పాటిస్తుంటారు.ఈ విధంగా శరీర బరువు తగ్గాలని భావించేవారు కేవలం ఈ పండ్ల రసాలను తాగడం వల్ల తొందరగా శరీర బరువును తగ్గించుకోవచ్చు.
శరీర బరువు తగ్గాలనుకొనే వారికి టమోటో జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది.బాగా పండిన టమోటో పండ్లను ఉడికించి వాటిని మిక్సీలో గ్రైండ్ చేసి కొద్దిగా బెల్లం కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.
అధిక మొత్తంలో ప్రొటీన్లు, మంచి కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ద్రాక్షరసం రెండు మూడు రోజులకు ఒకసారి తాగటం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.గ్లాస్ గోరువెచ్చని నీటిలోకి ఆరెంజ్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకుని తాగడం వల్ల తొందరగా శరీర బరువు తగ్గుతారు. రెండు రోజులకు ఒకసారి పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల తొందరగా శరీర బరువు తగ్గవచ్చు. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల మనలో కలిగే ఆకలి కోరికలను చంపేస్తుంది. ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గటానికి పైనాపిల్ జ్యూస్ ఎంతగానో దోహదపడుతుంది.
Share your comments