ప్రస్తుత కాలంలో ప్రజలు పూర్తిగా వారి జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో పెద్దఎత్తున మార్పులు సంభవించాయి. ఈ క్రమంలోనే అధికంగా శరీర బరువు పెరగటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా అధిక శరీర బరువు ఉన్నవారు శరీర బరువు తగ్గడం కోసం ప్రత్యేకమైన ఆహార నియమాలను పాటిస్తూ ఒక డైట్ చార్ట్ తయారుచేసుకుని ఉంటారు.అయితే ఈ డైట్ చార్ట్ లో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందించడంతో పాటు మన శరీరంలోని వివిధ భాగాల పని తీరును మెరుగుపరచడంలో దోహదపడతాయి.ఎప్పుడైతే మన శరీరంలో పిండిపదార్థాల లోపం ఏర్పడుతుందో అప్పుడు మనకు తీవ్రమైన తలనొప్పి, నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకోసమే డైట్ ఫాలో అయ్యేవారు తప్పనిసరిగా వారి డైట్ చార్ట్ లో కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
శరీర బరువు తగ్గాలని భావించే వారు వారి ఆహారంలో చిలగడ దుంపలను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. చిలకడ దుంపలు అధికమొత్తంలో కార్పోహైడ్రేట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. చిక్కుడు గింజలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు,సమృద్ధిగా ఉండటం వల్ల మన శరీర బరువు తగ్గడానికి దోహదం చేయడమే కాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా పాలు, పాల పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాలను పెంపొందింప చేస్తాయి.ఈ విధంగా కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు ఆయా సీజన్లలో లభించే తాజా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.
Share your comments