ఫోడ్మ్యాప్ ఆహారం అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు మనం తిన్న తర్వాత పూర్తిగా పేగులలో జీర్ణం కాకుండా, పాక్షికంగా మన పేగులలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫోడ్మ్యాప్ ఆహారం అని అంటారు.వాస్తవానికి ఫోడ్మ్యాప్ అంటే... ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డిసార్కరైడ్స్, మోనోశాకరైడ్స్ అండ్ పాలీయాల్స్ వంటి రకరకాల ఆహార పదార్థాలను సూచిస్తాయి.అయితే వీటిని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉండి ఉండటం చేత వీటిని సంక్షిప్త రూపంలో ఫోడ్మ్యాప్ గా పిలుస్తారు.
ఫోడ్మ్యాప్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలలో ఎక్కువగా కృత్రిమ చక్కెరలు, తీపి పదార్థాలు, పాలు పండ్లు, ఆపిల్, మామిడి, బీట్ రూట్, క్యాబేజీ, ఉల్లి వంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఫోడ్మ్యాప్ ఉంటుంది కనుక వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి.ఈ ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల మన ప్రేగులలో పూర్తిగా జీర్ణం కాక పాక్షికంగా మిగిలిపోతాయి. ఈ విధంగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు ప్రేగులలో పులియడం వల్ల మన జీర్ణశయంలో గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపులో నొప్పి, చాతిలో మంట ఏర్పడటం జరుగుతుంది.
ఈ విధమైనటువంటి సమస్యలు కలగకుండా ఉండాలంటే వీలైనంత వరకు మనం అరటి, బ్లూబెర్రీ, ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ అదేవిధంగా గుమ్మడి, పాలకూర, టొమాటో, చిలగడదుంప కొత్తిమీర, అల్లం, ల్యాక్టోజ్ లేని పాలు, ఆలివ్ ఆయిల్, పెరుగు వంటి వాటిల్లోనూ ఫోడ్మ్యాప్ తక్కువగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలను తీసుకోవడం ఎంతో ఉత్తమం.
Share your comments