Health & Lifestyle

కరివేపాకే కదాని తీసిపారేస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి

KJ Staff
KJ Staff

కూరలకు లేదా ఏమైనా ఇతర వంటకాలకు ప్రత్యేకమైన రుచిని మరియు సువాసనను అందించేది కరివేపాకు. కరివేపాకు లేకుండా చాలా కూరలను ఊహించుకోవడం చాలా కష్టం. అయితే మనలో చాలామంది కూరల్లో కరివేపాకు వస్తే తీసి పక్కన పెట్టేస్తుంటారు. చాలా మందికి కరివేపాకు రుచి నచ్చక దానిని తినడానికి ఇష్టపడరు. అయితే కరివేపాకుకు ఉన్న ప్రత్యేక లక్షణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కరివేపాకును అస్సలు వదిలిపెట్టారు. కర్వేపాకుకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ భారతదేశ వంటకాల్లో కరివేపాకును ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ చేసే అనేక రకాల వంటకాల్లో కరివేపాకును ఉపయోగించడం సహజంగా జరుగుతుంది. కరివేపాకులో ఎన్నో పోషకాలు మరియు ఖనిజాలు సంవృద్ధిగా లభిస్తాయి. కరివేపాకును తినడం ద్వారా ఎన్నో రకాల యాంటీఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాలు, మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించే విటమిన్-సి సంవృద్ధిగా లభిస్తాయి. కరివేపాకులో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలోని యాంటీఇంఫ్లమెటీరి, లక్షణాలు శరీరంలో కలిగే వాపును తగ్గించడంలో సహాయపడతాయి. 
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి కరివేపాకు ఒక దివ్యౌషధంగా చెప్పవచ్చు, దీనిలోని యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలోని చెక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కరివేపాకులో నికోటిన్ ఆమ్లం తో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ, ప్లాస్టిస్టెరాల్స్ ,అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. విటమిన్- ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. కరివేపాకులోని ఈ పోషకవిలువలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయం చేస్తుంది. కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, శరీరంలోని మలినాలను శుభ్రంచేసి వాటిని బయటకి పంపిస్తాయి, దీని వలన ఇన్ఫెక్షన్లు తలైతే ప్రమాదం తగ్గుతోంది. 
కరివేపాకులోని పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పతాయి, ఇవి జుట్టుకు బలానిచ్చి జుట్టు ఒత్తుగా ఎదిగేలా చేస్తుంది. కరివేపాకు ఫైబర్ కు మంచి వనరు, ప్రతిరోజు ఆహారంలో కరివేపాకు చేర్చుకోవడం ద్వారా జీర్ణసమస్యలు తగ్గడమే కాకుండా, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా కరివేపాకు గ్యాస్ట్రోసమస్యలు తగ్గించడంలో కూడా తనదైన పనితీరు కనబరుస్తుంది. చర్మన్నీ సంరక్షించి, చర్మసౌందర్యం పెంచడంలో కరివేపాకు ఎంతగానో తోడ్పడుతుంది. బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ లతో కరివేపాకు పోరాడుతుంది. హెపటైటిస్ , సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కరివేపాకు రక్షిస్తుంది. కాబట్టి కరివేపాకే కదా అని తీసి పక్కన పెట్టకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకోండి. భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా తీసి పారేయకండి.

Share your comments

Subscribe Magazine