వయసుపైబడే కొద్దీ శరీరంలో ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ రోజుల్లో వయసుతోపాటు వచ్చే సమస్యలు అధికమైపోయాయి. ఈ సమస్యల్లో ఆర్థరైటిస్, కండరాల సమస్యలు, గుండెకు సంబంధించి వ్యాధులు =, జుట్టు రాలిపోవడం మొదలైనవి, ప్రధానమైన సమస్యలు. ఈ సమస్యలకు కేవలం మందులతో పరిష్కారం దొరకదు. జీవితంలో కొన్ని అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా ఈ సమస్యలన్నిటినీ నివారించవచ్చు. దీనిలో భాగంగా ఉదయం నిద్రలేచిన వెంటనే చప్పట్లు కొట్టడం అలవాటు చేసుకోవాలి. చప్పట్లు కొడితే ప్రయోజనం ఏముంటుంది అనుకుంటున్నారా అయితే ఇప్పుడు దీనియొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
చప్పట్లు కొట్టడం ద్వారా రాపిడి జరిగి, నరాల్లో రక్తప్రశరణ బాగా జరుగుతుంది, ఇలా చెయ్యడం ద్వారా ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఇలా చప్పట్లు కొట్టడాన్ని క్లాపింగ్ థెరపీ అని పిలుస్తారు. కొన్ని అధ్యనాల ప్రకారం ఉదయం లేవగానే 300-400 సార్లు చప్పట్లు కొట్టడం ద్వారా శరీరమంతా రక్తప్రశరణ పెరగడమే కాకుండా కీళ్ల నొప్పులు కూడా దూరమవుతాయి అని తెలిసింది.
దీనితోపాటుగా మెదపట్టెయ్యడం, వెన్నునొప్పి వంటి సమస్యలు ఉన్నపుడు కూడా క్లాపింగ్ థెరపీ చెయ్యడం ద్వారా, కండరాల్లో రక్త ప్రశరణ పెరుగుతుంది, దీనితో ఈ నొప్పులన్ని తగ్గడానికి వీలుంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రక్తపోటు, ఊబకాయం, ఇటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా క్లాపింగ్ థెరపీ చక్కగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ విధంగా చప్పట్లు కొట్టడం జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. ఉదయం నిద్రలేచిన తరువాత, ప్రతిరోజు చప్పట్లు కొట్టడం అలవాటు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చప్పట్లు కొట్టడం ద్వారా మానశిక ప్రశాంతత కూడా లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్లాపింగ్ థెరపీ, రక్తపోటును అదుపులో ఉంచుతుంది, దీనివలన గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తకుండా నివారించవచ్చు. చప్పట్లు కొట్టడం ద్వారా గుండెతోపాటు, ఊపిరితిత్తులు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
చప్పట్లు కొట్టడం ద్వారా జుట్టు రాలే సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే జుట్టురాలకుండా ఉండడానికి, మరియు చప్పట్లకు సంబంధం ఏమిటన్న సందేహం మీకు కలిగి ఉండొచ్చు. చేతుల్లోని నరాలు నేరుగా తలకి మెదడుతో అనుసంధానమై ఉంటాయి, చప్పట్లు కొట్టినప్పుడు చేతిలో రాపిడి ద్వారా తలలోని జుట్టుకు ప్రయోజనం కలుగుతుంది.
ఈ విధంగా క్లాపింగ్ థెరపీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అయితే క్లాపింగ్ థెరపీ ద్వారా పూర్తిప్రయోజనం పొందాలంటే దీనిని సరైన పద్దతిలో పాటించాలి. ఉదయాన్నే లేవగానే, నడుమును నిటారుగా ఉంచి చేతులను చాచి చప్పట్లు కొట్టాలి, ఇలా చెయ్యడం, ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి
Share your comments