పొద్దున్నే లేవగానే వేడి వేడి బెడ్ కాఫీ తాగనిది ఎవరూ మంచం మీద నుంచి లేవరు. ప్రతిరోజు బెడ్ కాఫీతోనే చాలామంది రోజును ప్రారంభిస్తారు. అంతగా కాఫీకి మానవ జీవితంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇక టిఫిన్ చేసిన తర్వాత ఒక కాఫీ, మధ్యాహ్నం ఒక కాఫీ, సాయంత్రం ఒక కప్ కాఫీ తాగనిది చాలామందికి రోజు గడవదు. కాఫీ ప్రియులైతే అతి ఇష్టం ఆస్వాదిస్తూ కాఫీని ఆస్వాదిస్తారు. మంచి కాఫీ తాగితే ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తారు.
కాఫీ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల సీఆర్‌పీ, ఇంటర్‌ల్యూకిన్ 6, ట్యూమర్ నెక్రోసిస్ కారకం 1 లాంటి వాటిపై ప్రభుత్వం చూపుతోంది. దీని వల్ల కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం కూడా పెరుగుతుందని అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ రీసెర్చ్‌లో తేలింది. ప్రతిరోజు కాఫీ తాగేవారు కరోనా బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు రీసెర్చ్ ద్వారా గుర్తించారు. ప్రతిరోజు ఒక కప్పు లేదా అంతకంటే తక్కువ కాఫీ తాగేవారితో పోల్చితే రోజులో ఒక కప్పు కంటే అధికంగా కాపీ తీసుకునేవారిలో కరోనా బారిన పడే అవకాశాలు 10 శాతం తక్కువగా ఉంటాయట.
ఇక ప్రతిరోజు తాజా కూరగాయలు, తక్కువగా మాసం తీసుకునేవారు కోవిడ్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉందట. అలాగే కాఫీ తీసుకోవడం ద్వారా న్యూమోనియా బారిన పడే అవకాశం తక్కువగా ఉందట. కాఫీ రోగనిరోధకశక్తిని పెంపొందించకపోయినా.. ఉత్సాహంగా ఉండేలా చేస్తుందని రీసెర్చ్ లో తేలింది. ఇక కొవ్వును కరిగించే గుణాలు, గుండెజబ్బులు, డయాబెటిస్, పార్కిన్సన్స్ వంటి సమస్యలకు తగ్గించే గుణాలు కాఫీలో ఉంటాయట.
మన శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా చేసే గుణం కాఫీకి ఉంది. ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కాఫీ తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. డికక్షన్ ను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, అతినిద్ర, మూత్రసమస్యలు తొలగిపోతాయట. ఇక కాఫీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కెఫిన్ నరాలను ఉత్తేజపరిచి చురుగ్గా మారుస్తాయి. అయితే కాఫీ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. మూడుసార్లకు మించి కాఫీ తాగడం వల్ల రక్తసరఫరాలో ఇబ్బందులు తలెత్తి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే కాఫీ ఎక్కువగా తాడం వల్ల యువ్వనాన్ని కోల్పోయి త్వరగా వృద్ధాపం బారిన పడే అవకాశముంది. ఇక పిల్లలకు కాఫీ ఇవ్వడం మంచిది కాదు. పిల్లకు పాలు ఇవ్వడం శ్రేయస్కకరం. పరగడుపున కాఫీ తాగడం వల్లన జీర్ణకోశంలోకి ప్రవేశించి రక్తంలో ఆక్సిజన్ స్ధాయిలను అస్తవ్యస్తం చేస్తుంది.
Share your comments