భారతీయ వంటకాలకు ఉన్న ప్రత్యేకతే వేరు, వంటచెయ్యడానికి ఉపయోగించే ప్రతీ పదార్థంలోనూ ఎదో ఒక ఆరోగ్యం ప్రయోగానం ఉంటుంది, ఒక్కమాటలో చెప్పాలంటే మన ఆహారంలో రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు. ఎన్నో ప్రయోజనాలున్న వంట దినుసుల్లో బ్లాక్ స్లాట్ ఒకటి. ప్రస్తుతం చాలా మంది రిఫైన్డ్ సాల్ట్ ఎక్కువుగా వినియోగిస్తున్నారు, ఎందుకంటే ఈ రకం ఉప్పుని సులభంగా మరియు తక్కువ ధరకే కొనుగోలు చెయ్యచ్చు. అయితే బ్లాక్ స్లాట్ మాత్రం పోషకాల నిధి దీనిలో కాల్షియమ్, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి పోషకాలు సమ్వవృద్ధిగా లభిస్తాయి. ఈ బ్లాక్ సాల్ట్ ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది.
బ్లాక్ సాల్ట్ని ఎక్కువుగా కొన్ని రకాల పానీయాల తయారీలో, చాట్, మరియు సలాడ్ తయారీలో వినియోగిస్తారు. దీనిని వంటకాల్లో కూడా వినియోగించడం మొదలుపెడితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా అసిడిటీతో బాధపడేవారికి నల్ల ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది. తరచూ గ్యాస్ మరియు అసిడిటీ భారిన పడేవారిలో ఈ సమస్యలు నివారించడంలో నల్ల ఉప్పు చక్కగా పనిచేస్తుంది, అంతేకాకుండా నల్ల ఉప్పుతో చేసిన ఆహారం తినడం కాలేయం యొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ఈ మద్యకాలంలో అనారోగ్యపు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో జీర్ణసంబంధమైన వ్యాధులు ఎక్కువవుతున్నాయి, ఇటువంటి వారికి నల్ల ఉప్పు ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ సాల్ట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది దీనితోపాటు కడుపునొప్పికి కూడా నియంత్రిస్తుంది. బ్లాక్ సాల్ట్ చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో తనదైన పనితీరు కనబరుస్తుంది. చెడు ఆహారపు అలవాట్ల మూలంగా శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోతుంది, ఇది గుండె జబ్బులకు దారితియ్యవచ్చు. కాబట్టి ఆహారంలో సాధారణ ఉప్పును వినియోగించే బదులు నల్ల ఉప్పును వినియోగిస్తే, శరీరంలో చెడు కొవ్వు నివారించబడి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఉప్పు చక్కగా పనిచేస్తుంది, నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయి, కాబట్టి దీనిని సలాడ్స్ మరియు ఇతర పానీయాల్లో కలుపుకొని తీసుకోవడం ద్వారా తొందరగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఎంతటి ఆరోగ్యకారైనా సరే మితంగా తీసుకుంటే అమృతం లేకుంటే విషం, ఈ మాటను దృష్టిలో ఉంచుకొని దీనిని ప్రతిరోజు కొద్దిమొత్తంలోనే తీసుకోవాలి.
Share your comments