Health & Lifestyle

శంఖు పూలతో టీ, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది....

KJ Staff
KJ Staff

చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని, సాధారణ టీ కి బదులుగా, గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ వంటివి తాగుతుంటారు. అయితే వీటి లాగానే బ్లూ టీ కూడా ఉందని మనలో చాలా కొద్దీ మందికి మాత్రమే తెలుసు. శంఖుపులతో చేసే ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బ్లూ టీ ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

సాధారణంగా శంఖు పూలను దేవునికి అలంకారానికి ఉపయోగిస్తాం, అయితే వీటిలో శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఈ టీ తయారుచేసుకుని తాగడం మూలాన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. ఈ టీ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగైదు శంకు పుష్పాలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసు నీళ్లల్లో శంకు పుష్పాలను వేసి స్టవ్ పైన పెట్టి గ్లాసు నీళ్లు అయ్యేవరకు శంఖపుష్పాల యొక్క రంగు ఆ నీళ్లలో దిగే వరకు మరిగించాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసి అందులో కాస్త నిమ్మరసం, తేనే కలిపి టీలాగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

చర్మ ఛాయను, ఆకృతిని కూడా మెరుగుపరుస్తాయి. బ్లూ టీ మన జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. గట్ హెల్త్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది క్యాన్సర్ కారకమైనటువంటి కణాలతో పోరాటం చేసి క్యాన్సర్ కణాలు ఎదుగుదలను నిరోధిస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది.

శంఖు పూలతో చేసిన టీ తాగడం ద్వారా రక్త నాళాలు శుద్ధి చెయ్యబడతాయి. దీనితోపాటు కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తలనొప్పి, లేదా మైగ్రేన్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ టీ అద్భుతంగా పనిచేసి, ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. హై బీపీ సమస్యతో బాధపడేవారికి శంఖుపూల టీ ఒక దివ్యౌషదం వంటిదని చెప్పవచ్చు. ఇది గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. సహజసిద్ధమైన బ్లూ టీ బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే గొప్ప లక్షణాలు కూడా బ్లూ టీ లో ఉన్నాయి.

Share your comments

Subscribe Magazine