ఈ మధ్యకాలంలో ఆరోగ్యాభిలాషుల్లో ఎక్కువుగా వినిపిస్తున్న పేరు చియా విత్తనాలు. చిన్నగా ఆవాల సైజులో ఉండే ఈ విత్తనాలు ఎనలేని పోషకాల నిధి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియమ్ లభిస్తుంది. దీనితోపాటు మరెన్నో ప్రయోజనాలు చియా విత్తనాల సొంతం. అయితే చియా విత్తనాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు. వీటిని ఏ విధంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా విత్తనాలు పోషకాలకు ఒక గొప్ప నిధి వంటివి అని చెప్పుకోవచ్చు. వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు మరియు ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో వేడిని తగ్గించడంలో చియా విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా శరీరం శుద్ధి చెయ్యబడి అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చియా విత్తనాల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్, యాంటియోక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించి రోగాల భారిన పడకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
చియా సీడ్స్ లోని కాల్షియమ్ ఎముకుల బలానికి మరియు రోగనిరోధక శక్తికి ఎంతో కీలకం. అలాగే చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణసమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తినాలి. పరగడుపున చియా విత్తనాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ లభిచడమే కాకుండా, రోజంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది. జీర్ణసమస్యలు ఉన్నవారు, చియా గింజలు నానబెట్టి తీసుకోవడం ద్వారా జీర్ణసమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పటిష్టం చేసి అనేక వ్యాధులను తొలగిస్తుంది.
చియా గింజలు గ్యాస్, అజీర్తి, మలబద్దకం, అజీర్తి వంటి అనేక వ్యాధులను సమగ్రవంతంగా నివారిస్తుంది. దీనితోపాటుగా చియా గింజలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. నీటిలో నాబెట్టిన చియా గింజలు సలాడ్స్ వంటి వాటితో కలిపి తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలోని కొన్ని ప్రత్యేక గుణాల మూలంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నిర్ములించబడి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Share your comments