మనషి ఆరోగ్యానికి అతను పాటించే ఆహారపు అలవాట్లు ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం మరియు జీవనశైలి కలిగి ఉండటం తప్పనిసరి, లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్త ప్రమాదం ఉంటుంది. ప్రతి రోజు ఏదోఒకటి తినేస్తున్నాం అని కాకుండా, మన తీసుకునే ఆహారంలో వివిధ రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, మరియు ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి.
పీతలు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటిలోని పోషకాల గురించి, చాలా మందికి తెలియదు. పితలు విటమిన్లు, ఖనిజాలు, మరియు ప్రోటీన్లు లభించే సంపూర్ణ ఆహారం. ముందుగా వీటిలో ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల విటమిన్-బి 12 సంవృద్ధిగా లభిస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు, పీతలు తినడం చాలా మంచిది, వీటిలో నరాలకు శక్తినిచ్చి వాటి పనితీరును మెరుగుపరిచే లీన్ ప్రోటీన్ సంవృద్ధిగా లభిస్తుంది. లీన్ ప్రోటీన్ తీసుకోవడం ద్వారా అధిక బరువును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనితోపాటుగా పితల్లో జింక్, సెలీనియం, వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో తోడ్పడతాయి.
థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి పీతలు తినడం చాలా మంచిది. పితల్లో లభించే విటమిన్ బి-12, ఫోలేట్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు వివిధ ఆమ్లాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా పితల్లోని ప్రోటీన్ కండరాల ఆరోగ్యాన్ని పెంచి వాటిని పటిష్టం చేసేలా ప్రేరేపిస్తాయి. పితల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడమే కాకుండా గుండే ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. అలాగే రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును తగ్గేలా చేస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పీతలను మాంసాహారులు తమ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది.
Share your comments