Health & Lifestyle

లీచీ పళ్ళ వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

KJ Staff
KJ Staff

వర్షాకాలం వచ్చిందంటే పళ్ళ వ్యాపారుల దగ్గర లీచీ పళ్ళు సందడి చేస్తాయి. వీటి రుచి రుచి కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఈ లిచీ పళ్ళు ఎన్నో పోషకాలకు మూలం. వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. లిచీ పళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, కాల్షియమ్, ఐరన్ మెగ్నీషియం, జింక్ మరియు ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని పోషకాలున్న లీచీలను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో లాభం చేకూరుతుంది.

మెదడు ఆరోగ్యం:

వయసు పైబడే కొద్దీ మెదడులోని కొన్ని న్యూరోన్లు దెబ్బతిని, మతిమరుపు లేదా అల్జీమర్స్ వంటి వ్యాధులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. లిచీ పళ్ళు మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని తినడం ద్వారా అల్జిమర్స్ వంటి సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా లిచీ గింజలను పారేస్తుటారు, అయితే వీటి గింజల్లో సోపోనిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి, ఇవి అల్జిమర్స్ వ్యాధిని తగ్గిస్తాయని, పరిశోధనలో తేలింది.

ఇమ్మ్యూనిటి:

వర్షాకాలంలో శరీరం కాస్త మందగించి, రోగనిరోధక శక్తీ బలహీనపడుతుంది. దీనివలన జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి సమయంలో లిచీ తినడం చాలా మంచిది. లిచీ పళ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉండటం మూలాన ఇమ్మ్యూనిటి పెరుగుతుంది. అంతేకాకుండా లిచీ లోని పోలీసేకరయిడ్స్ , ఫ్లేవనోయిడ్స్ వంటి సమ్మేళనాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

డయాబెటిస్:

షుగర్ వ్యాధితో బాధపడేవారికి లిచీ ఎంతో మేలు చేస్తుంది, లిచీ పళ్లలో పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని అధ్యనాల ప్రకారం పాలిఫినాల్స్ ఎక్కువుగా ఉండే ఆహారం తినడం ద్వారా షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుందని తేలింది. షుగర్ ఉన్నవారు వీటిని తినడం ద్వారా మెటాబోలిజిమ్ తగ్గి, తరచూ మూత్ర విసర్జన చెయ్యడం, ఎక్కువ ఆకలి వెయ్యడం, వంటి సమస్యలు దూరమవుతాయి.

క్యాన్సర్:

లీచీ పళ్లలో కాన్సర్ ని నివారించే అనేక రకాల కారకాలు ఉంటాయి. దీనికి కారణం అందులోని పాలీఫెనాల్స్, పాలీశాకరైడ్స్. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆపుతాయి.అలాగే మహిళల్లో ప్రధానంగా కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో కూడా లిచీ పళ్ళు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఇన్ని లాభాలున్నా ఈ లిచీ పళ్ళను ఎలా తీసుకోవాలి అన్న సందేహం మీ అందరికి వచ్చే ఉంటుంది. వీటిని నేరుగా తినవచ్చు, లేదంటే ఎండబెట్టినవి కూడా తినడానికి మంచిది. మార్కెట్లో లిచీకి సంబంధించిన పళ్ళు కూడా లభిస్తాయి, వైద్యుల సలహాతో వీటిని తీసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine