Health & Lifestyle

జుట్టు రాలిపోవడానికి ముఖ్యమైన కారణం, మరియు నివారణ

KJ Staff
KJ Staff

ఈ రోజుల్లో అందరిని పీడించే సమస్యల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. కొంతమందిలో జుట్టు రాలడం ఎక్కువుగా ఉంటుంది, వీరికి చిన్న వయసులోనే బట్టతలాగా మారడం మనం గమనించవచ్చు. అయితే జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో మొదటిది మినిరల్స్ లోపం. జుట్టు పెరగడానికి మరియు జుట్టు వేర్లు బలంగా మారడానికి కొన్ని రకాలా పోషకాలు అవసరం. ఐరన్, ఫోలేట్, విటమిన్-ఏ, విటమిన్-సి వంటి పోషకాలు జుట్టు ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఈ పోషకాలు కనుక లోపించినట్లైతే జుట్టు రాలడం ఎక్కువుగా ఉంటుంది.

జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అన్ని మనం ప్రతిరోజు తినే డైట్ లో ఉండేలా చూసుకోవాలి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి వివిధ షాంపూలు, కండీషనర్లు వాడిన ఫలితం లేదు అనుకునేవారు, మీ ఆహారంలో పాలకూరను చేర్చుకొని చూడండి. పాలకూరలో ఉండే పోషకాలు జుట్టు ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. పాలకూర జుట్టుకు సహజసిద్దమైన పోషకాలను అందించి, ఒత్తుగా మరియు ఆకర్షనియ్యంగా ఎదిగేలా ప్రేరేపిస్తుంది. పాలకూరలో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి.

జుట్టు ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఎంతగానో సహాయపడతాయి. మన రోజు తినే ఆహారంలో, జీడిపప్పు, బాదాం, పిస్తా మొదలైన నట్స్ చేర్చుకోవడం ద్వారా జుట్టుకు మేలు కలుగుతుంది. ఇందులో విటమిన్‌ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు ఉడటం తగ్గించి, జుట్టు బలంగా పెరిగేందుకు తోడ్పడుతుంది.

కోడి గుడ్లు, చేపలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కోడి గుడ్డులో, ప్రోటీన్, ఐరన్, ఒమేగా-6 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్- బి12 వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా గుడ్డు పచ్చ సొనలో విటమిన్ ఏ, ఇ, బయోటిన్, ఫోలేట్ మొదలైన పోషకాలు జుట్టు ఎదుగుదలలో తోడ్పడతాయి. అదేవిధంగా చేపల్లో ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చేసి, జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి.

బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, మొదలైన బెర్రీలు ప్రతిరోజు తీసుకుంటే జుట్టు మోడళ్ళు గట్టిపడి, జుట్టు రాలడం తగ్గుతుంది. పుల్లని రుచి కలిగిన ఈ బెర్రీలలో జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్-సి సంవృద్ధిగా లభిస్తుంది. జుట్టురాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి చిలకడదుంప కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిలకడదుంపలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-సి లోపాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine