Health & Lifestyle

పిల్లల్లో వచ్చే ఊబకాయానికి కారణాలు ఏమిటి?

KJ Staff
KJ Staff

పెద్దలు చాల మందిలో ఊబకాయం చూస్తుంటాం, అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఊబకాయం సమస్యలు పెరిగిపోతున్నాయి. క్రమశిక్షణ లేని ఆహారం, మరియు జంక్ ఫుడ్ కి అలవాటు పడిన పిల్లలో ఊబకాయం రావడం గమనించవచ్చు. ఈ ఊబకాయం సమస్య చివరికి డయాబెటిస్ కు దారి తీస్తుంది. పిల్లల్లో అధిక బరువు లేదా ఊబకాయం సమ్యస రావడానికి అనేక కారణాలున్నాయి. వీటిని సరిచేసుకోగలిగితే పిల్లలు అధికంగా బరువు పెరిగిపోకుండా కాపాడవచ్చు. ఈ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఆహారపు అలవాట్లు:

ఊబకాయం రావడానికి ఆహారపు అలవాట్లు మొదటి కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న పిల్లల్లో ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారంకంటే కెలోరీలు ఎక్కువుగా ఉండే తీపి పదార్ధాలు, లేదా జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. చెక్కెర ఎక్కువగా కలిగిన ఆహారం తింటే బరువు వేగంగా పెరిగిపోతారు. పైగా వీరు తినే చాలా రకాల ఆహారంలో ఎటువంటి పోషకాలు మరియు ఖనిజాలు ఉండవు, దీనివలన ఆరోగ్య సమస్యలు తలైతే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లలను జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచి, పోషకాలతో కూడిన ఆహారం అలవాటు చెయ్యాలి.

శారీరిక శ్రమ:

ఒకప్పుడు ఒక వీధిలోని పిల్లలంతా కలిసి, ఎన్నో రకాల ఆటలు ఆదుకునేవాడు, దీని వలన వారికి మానశిక వికాసంతో పాటు, శారీరిక శ్రమ కూడా లభించేది. ఈ రోజుల్లో పిల్లలు ఆరుబయట ఆదుకోవడం, చాలావరకు తగ్గిపోయింది. స్మార్ట్ఫోన్ లేదంటే టీవీ ని వదిలిపెట్టి పిల్లలు బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. దీనివలన వారికి శారీరిక శ్రమ ఉండటం లేదు, పైగా ఎక్కువ క్యాలోరీలు ఉన్న ఆహారం తినడం, ఆ క్యాలోరీలు ఖర్చు కాకపోవడంతో వీరు బరువు పెరగడం లేదా ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, పిల్లులు బయటకు వెళ్లి ఆదుకునేలా వారిని ప్రోత్సహించాలి, లేదంటే స్విమ్మింగ్, యోగ, కరాటే వంటి తరగతులకు పంపించడం ద్వారా పిల్లలకు వ్యాయామం లభిస్తుంది.

జన్యువులు , మరియు కుటుంబ అలవాట్లు

కొందరు పిల్లలు ఏమి తినకపోయినా వారు వేగంగా బరువు పెరుగుతుంటారు, ఇటువంటి వారు ఆహార నియమాలను పాటిస్తూ, శారీరిక వ్యాయాయం చేస్తే బరువు పెరగకుండా ఉంటారు. చాలా సార్లు పిల్లలు బరువు పెరగడానికి కుటుంబ సభ్యుల అలవాట్లు కూడా ఒక కారణం అవ్వొచ్చు. పెద్దవాళ్ల జీవనశైలి పిల్లలను ప్రభావితం చేస్తుంది. పెద్దలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తే పిల్లలకు కూడా వాటిని అలవాటు చేసుకుంటారు కాబట్టి, తల్లితండ్రులు తాము ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవడంతోపాటు పిల్లలకు కూడా వాటిని నేర్పించాలి.

నిద్రలేమి:

ఎదిగేవయసున్న పిల్లలు రోజుకు కనీసం ఎనిమిది గంటలైనా నిద్రపోవాలి. ఫోన్లు మరియు టీవీల మోజులో పడి చాలామంది పిల్లలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతుంటారు. ఇది క్రమంగా నిద్రలేమికి కారణమవుతుంది. దీనిప్రభావంతో ఒంట్లోని హార్మోన్లు అస్తవ్యస్తం అవుతాయి. దీనితో ఆకలి పెరిగి ఎక్కువగా తినడం ద్వారా ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Share your comments

Subscribe Magazine