Health & Lifestyle

చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి కారణాలు మరియు నివారణ చర్యలు....

KJ Staff
KJ Staff

వయసుపైబడే కొద్దీ జుట్టు తెల్లబడటం సహజం, అయితే కొంత మందిలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ప్రస్తుతం చాలా మందికి ఇది అతిపెద్ద సమస్యగా మారింది. అయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి అనేక కారణాలు ఉండచ్చు, ఈ కారణాలు గురించి తెలుసుకొని కొన్ని పద్దతలను పాటించడం ద్వారా జుట్టు తెల్లబడడం తగ్గించవచ్చు.

చాలా మందిలో జన్యుపరమైన లోపాల కారణంగా జుట్టు తెల్లబడుతుంది, ఇటువంటి పరిస్థితిలో మనం చేయగలిగేది ఏమి ఉండదు. అయితే చాలా మందిలో పౌష్టికాహార లోపం వలన కూడా జుట్టు తెల్లబడేందుకు అవకాశం ఉంటుంది. మనం రోజు తినే ఆహారంలో పోషకాల లోపం ఉన్నట్లైతే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. పోషకాల లోపాన్ని గుర్తించి అందుకు తగిన ఆహారం తీసుకుంటే తెల్ల జుట్టును కూడా నివారించవచ్చు.

తరచు ఒత్తిడికి గురయ్యే వారిలో తెల్ల జుట్టు సమస్య ఎక్కువుగా ఉంటుంది. ఒత్తిడికి గురికావడం వలన జుట్టు ప్రోటీన్ ఉత్పత్తి తగ్గుతుంది, దీని మూలంగా జుట్టు నల్లబడుతుంది. ఒత్తిడి ఎక్కువుగా ఉండేవారిలో జుట్టు తెల్లబడటం తో పాటు జుట్టు ఎక్కువుగా రాలిపోయి బట్టతలా వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగ, మెడిటేషన్ వంటివి చెయ్యడం అలవాటు చేసుకోవాలి. తీవ్రమైన ఎండలో తిరిగేవారిలో కూడా తెల్లజుట్టు సమస్య ఎక్కువుగా ఉంటుంది. ఎండలో ఎక్కువుగా తిరగడం వలన మెలనిన్ ఉత్పత్తి తగ్గి జుట్టు తెల్లబడటం ఎక్కువవుతుంది.

అయితే తెల్లజుట్టును తగ్గించుకోవడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఉదయాన్నే లేవగానే కాలికడుపుతో ఉసిరికాయ రసాన్ని తాగడం ద్వారా జుట్టు తెల్లబడే సమస్య తగ్గుతుంది, ఉసిరిలోని విటమిన్-సి జుట్టుకు పోషణనిచ్చి, జుట్టు ఎదుగుదలలో తోడ్పడుతుంది. తెల్లజుట్టు సమస్య ఎక్కువుగా ఉన్నవారు, వారానికి రెండు సార్లు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించడం ద్వారా తెల్లజుట్టు సమస్య దూరమవవుతుంది. ఉల్లిపాయ రసంలో సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్ లక్షణాలు తెల్లజుట్టును తగ్గించడంలో సహాయపడతాయి.

జుట్టుకు అధిక పోషణనిచ్చే పదర్ధాల్లో కరివేపాకు ఒకటి. కరివేపాకును పేస్ట్ లాగ చేసి పెరుగులో కలిపి తలకు పట్టించాలి. 30 నిముషాలు ఉంచిన తరువాత శుభ్రంగా కడుక్కోవాలి, కరివేపాకులోని పోషకాలు జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తాయి, అంతేకాకుండా జుట్టుకు బలానిచ్చి జుట్టు రాలిపోకుండా కాపాడతాయి.

Share your comments

Subscribe Magazine