Health & Lifestyle

స్పైసి ఫుడ్ ఎక్కువుగా తింటున్నారా? దీని దుష్ప్రభావాలు ఏమిటి

KJ Staff
KJ Staff

చాలా మంది స్పైసిగా ఉండే ఆహారం అంటే ఎంతో ఇష్టంగా తింటారు. రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు, స్పైసి ఫుడ్ అడిగిమరి తినే వారి సంఖ్య చాలా ఎక్కువ. స్పైసి ఫుడ్ మీద మక్కువతో ప్రతి రోజు మూడు పూటలా స్పైసి ఫుడ్ తినేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే స్పైసి ఫుడ్ ఎక్కువుగా తినడం ద్వారా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఇటువంటి ఆహారం ఎక్కువ కాలం తీసుకుంటే ఆయుషు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

రామెన్ నూడుల్స్ గురించి మనలో చాల మందికి తెలుసు. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. అంత స్పైసీగా తినడం ఆరోగ్యకరము కాదని యూరోపియన్ దేశాల్లో ఈ రామన్ నూడుల్స్ ను నిషేధించారు. అంతేకాదు అమెరికాలో జరిగిన ఒక స్పైసీ ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వ్యక్తి ఆ తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడి మరణించినట్టు కూడా తెలుస్తోంది. దీన్నిబట్టి కారం అధికంగా తినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

అయితే కారానికి అంత ఘాటు రావడానికి మిరిపాకాయల్లో ఉండే క్యాప్ససిన్ అనే సమ్మేళనం కారణం. ఇది నోటికి మండుతున్న అనుభూతిని ఇస్తుంది. ఈ సమ్మేళనం, వివిధ రకాల మిరపకాయల్లో, వైవిధ్యంగా ఉంటుంది. ఘాటు అధికంగా ఉన్న ఆహారం తరచూ తినడం ద్వారా జీవిత కాలం తగ్గిపోతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇటీవల అధికంగా క్యాప్సైసిన్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి, దాన్ని తినవద్దని తమ దేశస్థులను హెచ్చరించింది డెన్మార్క్ దేశం.

క్యాప్సైసిన్ అధికంగా ఉన్న కారాన్ని, పచ్చిమిరపకాయలను వేసుకుని కూరలను, బిర్యానీలను తినడం వల్ల చాలా తక్కువ కాలంలోనే పొట్టలో మంట మొదలవుతుంది. అది గుండెకు చేరుతుంది. వికారంగా అనిపించడం, ఛాతీలో మంట, విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే రక్తపోటులో కూడా హెచ్చుతగ్గులు మొదలవుతాయి. మైకం కమ్మినట్టు అవుతుంది. శరీరానికి చెమటలు పడుతుంది. ఇలాంటి లక్షణాలు మీరు స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే కనిపిస్తే మీ శరీరం ఆ కారాన్ని తట్టుకోలేకపోతుందని గుర్తించాలి.
అయితే ఎటువంటి లక్షణాలు కనిపించే వారు కారం తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కారం ఎక్కువుగా ఉన్న ఆహారం తిన్న తరువాత, పొట్టుకడుపులో నొప్పి రావడం, లేదా ఆహరం జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కారంగా ఉండే ఆహారం తీసుకోవడం మానెయ్యాలి. కారం ఎక్కువుగా ఉండే ఆహారం తీసుకొవడం ద్వారా శరీరం అంత మండుతున్నటు అనిపిస్తుంది. కాబట్టి మనం తినగలిగే అంత కారం మాత్రమే తినడం మంచిది. 

Share your comments

Subscribe Magazine