Health & Lifestyle

డిన్నర్ తిన్నవెంటనే పడుకుంటే ఏమవుతుంది?

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అనారోగ్యకరమైన జీవనశైలి దీనికి ప్రధాన కారణం అన్ని చెప్పవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనప్రమాణాలు కూడా మారుతున్నాయి. ఆరోగ్యం విషయంలో ఆహారం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సరైన రీతిలో మరియు సరైన సమయంలో ఆహారం తీసుకుంటే అది అమృతం, అదే ఆహారం విష్యంలో నిర్లక్ష్యం చేస్తే అది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది.చాలా మంది సమయానుకూలంగా ఆహారం తీసుకోక ఎన్నో రకాల అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు.

సాధారణంగా చాలా మందికి రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అలవాటు. అంతేకాకుండా అర్థరాత్రి కూడా తినేవారు చాలామంది ఉన్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో శరీరం తననితాను రిపేర్ చేసుకుంటుంది, ఈ సమయంలో ఆహారం జీర్ణంకావడం వంటి క్రియలు కాస్త మందబడిగా సాగుతాయి. రాత్రి పుట భోజనం చెయ్యగానే, ఎటువంటి వ్యాయామం లేకుండా నిద్రపోవడం వలన జీర్ణసమస్యలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

రాత్రి భోజనం చెయ్యగానే నిద్రపోకుండా కొద్దీ పాటి వ్యాయామమైన శరీరానికి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం చేసాక కొంచెంసేపు నడవడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుంది. ఇలా నడవడం ద్వారా జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు దోహదపడుతుంది. అయితే భోజనం చేసాక వేగంగా పరిగెత్తడం, మంచిది కాదు, నెమ్మదిగా ఒక 10-15 నిమిషాలసేపు నడిస్తే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.

అంతేకాకుండా నడవడం వలన కుంచించుకుపోయిన కండరాలు తిరిగి మాములు స్థితికి చేరుకుంటాయి, దీనితోపాటు శరీరం మొత్తం రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రాత్రి సమయంలో జీర్ణవ్యవస్థ మందబడిగా ఉంటుంది, నడవడం ద్వారా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే పనివల్ల కలిగే ఒత్తిడిని కూడా నడక పొగుడుతుంది, ఒత్తిడి తగ్గడం వలన ప్రశాంతంగా నిద్రపోయేందుకు వీలుంటుంది.

రాత్రి మంచిగా నిద్రపట్టాలంటే, తిన్న వెంటనే నడిస్తే సరిపోతుంది. భోజనం చేసాక నిద్రపోతే ఆహారం సర్రిగా జీర్ణం కాదు, దీనివలన బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తవచ్చు. షుగర్ ఉన్నవారు మరియు, బీపీ ఉన్నవారు తిన్నవెంటనే పడుకోవడం మంచిది కాదు. తిన్న తరువాత నడవడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించబడతాయి. దీనితోపాటు బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

Related Topics

#Health #Lifestylde #Eating

Share your comments

Subscribe Magazine