సన్ స్ట్రోక్ గురించి విన్నాం, ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఏమిటి? అన్న సందేహం మీ అందరికి వచ్చే ఉంటుంది. మనిషి ఉన్నటుంది స్పృహతప్పి పడిపోవడం, కోమాలోకి వెళ్లడం, మొదలైనవి బ్రెయిన్ స్ట్రోక్ పరిణామాలే. నేడు ఎంతోమంది ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. బ్రెయిన్ స్ట్రోక్ మీద సరైన అవగాహన లేకపోవడం వలన కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి? వాటి ఎలా గుర్తించడం? అన్న విష్యం మీద అవగాహన ఉంటే, ముందుగానే సరైన చికిత్స తీసుకోని ప్రాణహాని నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
బ్రెయిన్ స్ట్రోక్ కి సరైన సమయంలో చికిత్స దొరక్క ఎంతో మంది దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ భారిన పడుతున్నారు, చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. చాలా సందర్భాల్లో మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగదు, మరికొన్ని సార్లు మెదడు రక్త నాళాల్లో రక్తం గడ్డకడుతుంది. ఇటువంటి సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు జీవితాంతం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మన శరీరం కొన్ని సంకేతాలను పంపిస్తుంది. వీటిని ముందుగానే గ్రహించగలిగితే బ్రెయిన్ స్ట్రోక్ భారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం మొత్తం బలహీనంగా మారుతుంది, దీనితోపాటు మాట కూడా నెత్తిగా మారుతుంది. దీనితోపాటు ఒళ్ళంతా తిమ్మిర్లు, పని మీద ద్రుష్టి తగ్గిపోవడం, ఏదైనా పనిచేసే ముందు తికమకగా ఉండడం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే ప్రధానమైన లక్షణాలు.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు విపరీతమైన తలనొప్పి, నీరసం, మరియు శరీరం మీద పట్టు కోల్పోయినట్టు అనిపిస్తుంది. ముఖ కావలికల్లో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కంటి చూపు క్రమంగా మందగించి ఒక్కసారిగా రెండుకళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిటారుగా నిలబడటం కూడా కష్టంగా మారుతుంది, మరియు ముఖం ఒకవైపు జారిపోయినట్లు కనిపిస్తుంది. చేతులు బలహీనంగా మారిపోతాయి.
ఇటువంటి లక్షణాలు తరచు కనిపిస్తున్న లేదంటే తీవ్రమైన స్థాయిలో ఉన్నాసరే ఆలస్యం చెయ్యకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఒక్కసారిగా స్పృహకోల్పోవడం లేదంటే కోమాలోకి వెళ్లడం వంటివి జరగవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ కి అవసరమైన చికిత్స తీసుకుంటే స్ట్రోక్ రాకుండా కాపాడే అవకాశం ఉంటుంది.
Share your comments