Health & Lifestyle

రహదారిపై ఉండే లైన్లకు అర్థం ఏమిటో తెలుసా?

KJ Staff
KJ Staff

రహదారిపై ప్రయాణం సుఖమయంగా మరియు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది, అందుకేనేమో ప్రజలు టోల్ టాక్స్ ఉన్నాసరే రహదారిమీద ప్రయాణించాలని అనుకుంటారు. రహదారిపై ప్రయాణం ఎంత సులభతరమైన మార్గమధ్యంలో కనిపించే కొన్ని సంకేతాలను అర్థంచేసుకోవాల్సి ఉంటుంది, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కోసారి ఈ సంకేతాలే మన జీవితాన్ని కూడా కాపాడవచు. రహదారిపై ఉండే లైన్లు, డ్రైవర్లకు కొన్ని సంకేతాలను తెలియచేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రహదారి పొడవునా ఎరుపు మరియు పసుపు రంగుల్లో ఈ గీతాలు ఉండటం గమనించవచ్చు. అయితే వాహనాలు నడిపే అందరికి వీటి గురించి తెలియాలని లేదు, వీటి గురించి తెలుసుకోవడం చాల అవసరం, ఎందుకంటే ఒకొక్కసారి ఇవే మన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ లైన్లలో ఎన్నో రకాలు ఉన్నాయి, వాటిలో మొదటిది బ్రోకెన్ వైట్ లైన్, మిగిలిన అన్ని లైన్లతో పోలిస్తే ఈ లైన్ సర్వసాధారణం. ఈ లైన్ రోడ్డును రెండు భాగాలుగా విభజిస్తుంది. అంతేకాకుండా ఈ లైన్కు ఇరువైపులా ట్రాఫిక్ ఉంటుంది, కాబట్టి డ్రైవర్ ఎడమవైపు నుండి మాత్రమే ప్రయాణించాలి మరియు ఈ వైపు నుండే ముందు వాహనాలను దాటుకొని వెళ్ళాలి.

కంటిన్యూ వైట్ లైన్ గీతాలు రోడ్ పొడవునా వ్యాపించి ఉంటాయి. రోడ్ కు ఎడమవైపున మాత్రమే ట్రాఫిక్ కదలాలని ఈ లైన్ సూచిస్తుంది అంతే కాకుండా ఇటువంటి లైన్ ఉన్న రోడ్ల మీద ఓవర్టేక్ చెయ్యడానికి లేదా యు-టర్న్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. బ్రోకెన్ ఎల్లో లైన్ ఉన్న రోడ్లు మీద బ్రోకెన్ వైట్ లైన్ మాదిరిగానే ఉంటాయి. ఈ రకమైన లైన్ ఉన్న రోడ్ల మీద కూడా మీరు ఎదురుగ ఉన్న వాహనాలను ఓవర్ టేక్ చెయ్యచ్చు లేదంటే యూ-టర్న్ కూడా చెయ్యచ్చు.

చివరిగా కంటిన్యూస్ యెల్లో లైన్, ఉన్న రోడ్లకు కూడా కంటిన్యూస్ వైట్ లైన్ ఉన్న రోడ్లకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి, ఈ రోడ్ల మీద కూడా ఎదుటి వాహనాలను దాటి ముందుకు వెళ్ళడానికి కానీ లేదా యూ-టర్న్ తీసుకోవడానికి కానీ వీలులేదు అని అర్ధం. అయితే పొడవైన ఎల్లో లైన్ ఉంటె ఆ రోడ్ ఎన్నో మలుపు తిరిగిఉంటుందని అర్ధం చేసుకోవచ్చు, మలుపులు ఎక్కువుగా ఉండటం వలన ఎదురుగ వచ్చే ముందు వాహనాలు కనిపించవు కాబట్టి ఇటువంటి రోడ్ల మీద ఓవర్ టేక్ చెయ్యకూడదు.

Related Topics

#HighWay #Indications #Lines

Share your comments

Subscribe Magazine