Health & Lifestyle

మూత్రం రంగు దేనిని సూచిస్తుంది?

KJ Staff
KJ Staff

కిడ్నీలు మన రక్తంలోని వ్యర్ధాలను శుభ్రంచేసి మూత్రం రూపంలో బయటకి పంపుతాయి. మూత్రం యొక్క రంగు ఆధారంగా శరీరంలోని ఎన్నో ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. మూత్రంగా ఆధారంగా మన శరీరం ఎటువంటి పరిస్థితిలో ఉందొ అంచనా వేసేందుకు వీలుంటుంది. మనం తాగే నీటిని శరీరం ఉపయోగించిన తరువాత మిగిలిన నీటిని మరియు ఇతర వ్యర్ధాలు మూత్రంలాగా బయటకు పోతాయి. మూత్రంలో నీటితో పాటు, వ్యర్ధాలు మరియు ఇతర లవణాలు, యూరియా ఉంటాయి. వీటి మూలంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది, ఈ రంగులో ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు పరిగణించవచ్చు. అయితే మూత్రం ఎరుపు రంగుతోపాటు మరికొన్ని అసాధారణ రంగుల్లో ఉంటే ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. విభిన్న రంగుల్లో ఉండే మూత్రం దేనికి సంకేతంగా భావించవచో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు:

మూత్రంలో వ్యర్ధాలతో పాటు, రక్తంతో కూడా కలిసి ఉంటే ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగు మూత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం. ఎరుపు రంగు మూత్రం, కిడ్నీలో రాళ్ళూ, కిడ్నీ సమస్యలు మరియు కిడ్నీ క్యాన్సర్ ను సూచిస్తుంది కాబట్టి, మూత్రం ఎరుపు రంగులో ఉంటె అశ్రద్ధ చెయ్యకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. అయితే, బీట్రూట్, బ్లక్ బెర్రీలు వంటి తిన్నపుడు కూడా మూత్రం ఎరుపు రంగులోకి మారడం గమనించవచ్చు.

ముదురు పసుపు రంగు:

మూత్రం ముదురు పసుపు లేదా నారింజ రంగులో ఉంటే శరీరం డిహైడ్రాట్ అయ్యిందని గుర్తించాలి. వేడి ప్రదేశాల్లో జీవిచేవారు, వ్యాయామం చేసేవారు, ఎక్కువుగా పనిచేసే వారిలో డిహైడ్రాషన్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో మూత్రం ముదురు పసుపు రంగులోకి మారిపోతుంది. ఇటువంటి సమయాల్లో వెంటనే శరైరనికి అవసరమైన నీటిని అందించాలి. డిహైడ్రాషన్ సమస్యను వదిలేస్తే అది కిడ్నీ లో రాళ్ళూ ఏర్పడేలా చేస్తుంది.

పాల రంగు:

మూత్రం కొన్ని తెలుపు రంగులో ఉండటం సహజం అయితే మూత్రం పాల రంగులోకి మారితే అది ఇన్ఫెక్షన్లను సూచిస్తుంది. వైరస్, బాక్టీరియా, మరియు శిలింద్రాల వలన ఇన్ఫెక్షన్ రావచ్చు. పాల రంగు మూత్రం ఎలీఫన్టీయాసిస్ ను కూడా సూచిస్తుంది. మూత్రం పాల రంగులోకి మారడం లేదంటే దుర్వాసన రావడం వంటివి గమనిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.

కాఫీ రంగు/ లేదా నలుపు రంగు:

కొన్ని సందర్భాల్లో మూత్రం కాఫీ రంగు లేదంటే నలుపు రంగులోకి మారుతుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఉన్నపుడు మూత్రం ఈ రంగులోకి మారుతుంది. దీనితోపాటు, మలేరియా చికిత్స కోసం తీసుకునే క్లోరోక్విన్, ప్రైమాక్విన్ వంటి మందులు మరోయు కొన్ని రకాల యాంటిబయోటిక్లూ కూడా మూత్రం నలుపు రంగులోకి మారడానికి కారణం కావచ్చు. నలుపు రంగు మూత్రానికి చికిత్స చేయకుంటే మూత్రపిండాల వ్యాధులకు దారితియ్యవచ్చు.

ఆకుపచ్చ మరియు నీలం రంగు:

ఈ రంగుల్లో మూత్రం ఉండటం చాలా అరుదు. కొన్ని రకాల బాక్టీరియాల్ ఇన్ఫెక్షన్లు మూత్రం ఆకుపచ్చ రంగులోకి మారడానికి కారణమవుతుంది. దీనితోపాటు ఫుడ్స్ కలర్స్ ఎక్కువగా వాడిన ఆహరం తినడం వలన కూడా మూత్రం ఆకుపచ్చ మరియు నీలం రంగులోకి మారేందుకు అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine