మనుషులను ఏదొక వ్యాధి పటిపీడించడం సర్వసాధారణం. మారుతున్న కాలానికి అనుగుణంగా రోజుకొక కొత్త వ్యాధి పుట్టుకొస్తుంది. కొన్ని శారీరక వ్యాధులైతే మరికొన్ని మానసికంగా ఇబ్బందికి గురిచేస్తాయి. అటువంటి మనషిక వ్యాధుల్లో ఈ ఇడియట్ సిండ్రోమ్ ఒకటి. ఈ వ్యాధి ఉన్నవారికి ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు కూడా తెలీదు. ఈ వ్యాధి లక్షణాలేంటి, మరియు ఈ వ్యాధి వలన ఎంత ప్రమాదముందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫోరమేషన్ అబ్స్ట్రుక్షన్ ట్రీట్మెంట్ ఈ వ్యాధిని చిన్నగా 'ఇడియట్ సిండ్రోమ్' అంటారు. ఈ వ్యాధి మిగతా వాటిలా అంటువ్యాధి కాదు, మనిషి తనకుతానే వ్యాధునిలాగా భావించి, ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా తమ వ్యాధులకు చికిత్స చేసుకునే వారిని ఈ ఇడియట్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్థులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది, మన అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకువచ్చింది, ఎంటర్టైన్మెంట్ కోసం, ఫుడ్ ఆర్డర్ చెయ్యడానికే కాకుండా కొంత మంది తమ రోగాలను నయం చేసుకోవడానికి కూడా ఇంటర్నెట్ మాధ్యమాల మీద ఆధారపడుతున్నారు.
ప్రస్తుతం చాల మంది అస్వస్థతకు గురైనప్పుడు, డాక్టర్ ని సంప్రదించకుండా, ఆన్లైన్ హెల్త్ సమాచారాన్ని ప్రాధాన్యతనిచ్చి స్వయంగా చికిత్స తీసుకుంటున్నారు. తమకున్న వ్యాధి లక్షలను గూగుల్ వంటి మాధ్యమాల్లో సెర్చ్ చేసి, వెబ్సైట్లలో పొందుపరిచిన విధంగా చికిత్స తీసుకుంటున్నారు. కొంతమందైతే డాక్టర్లు సూచించిన చికిత్సను కూడా పక్కన పెట్టి డిజిటల్ మాద్యమాల్లోని సమాచారాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ, తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మనకు వచ్చిన వ్యాధి గురించి తెలుసుకోవడంలో ఎటువంటి తప్పులేదు, నిజానికి అలాచేస్తే మన పరిస్థితి గురించి పూర్తి అవగాహన లభించి మరింత జాగ్రత్తగా ఉండేందుకు అవకాశం ఉంటుంది, అలాకాకుండా వైద్యులు సూచించిన ట్రీట్మెంట్ పక్కన పెట్టి, సొంతంగా చికిత్స తీసుకున్నట్లైతే ఎన్నో ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. ఈ ఇడియట్ సిండ్రోమ్ మరిముదిరితే వైద్య సహాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుస్తుంది.
కొన్ని సార్లు ఆన్లైన్ లో సరైన సమాచారం లభించదు, ఆరోగ్యం పై తప్పుడు సమాచారం తెలుసుకున్న వ్యక్తి, తనకేదో పెద్ద ప్రమాదం ఉన్నట్లు ఉహించుకొని మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రోగాని నిర్ధారించుకోవడానికి మరియు దానికి తగిన చికిత్స పొందడానికి వైద్యుని సంప్రదించడమే ఉత్తమం.
Share your comments