Health & Lifestyle

లివర్ సిరోసిస్ లక్షణాలు, మరియు దీనికి కారణాలు.....

KJ Staff
KJ Staff

శరీరంలోని అతిముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి. లివర్ పనితీరు బాగుంటేనే, ఆరోగ్యం భాగుండుతుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిక్ పదార్ధాలను వడగట్టడం, మందులను విభజించడం, ప్రోటీన్ల తయారీ, ఇలా లివర్ ఎన్నో పనులను చేస్తుంది. అయితే లివర్ ని మొండి అవయవంగా పరిగణిస్తారు, ఎందుకంటే లివర్ లో కొంత భాగం దెబ్బతిన్న సరే, తిరిగి నయం చేసుకోగలిగే శక్తీ లివర్ కు ఉంది. కొన్ని లివర్ కొన్ని కారణాల వలన గట్టి పడుతుంది, దీనిని లివర్ సిరోసిస్ అని పిలుస్తారు. లివర్కి వచ్చే వ్యాధుల్లో ఇది తీవ్రమైనదిగా పరిగణిస్తారు.

లివర్ సిరోసిస్, వస్తే లివర్ లో కొంత భాగం మొదట గట్టిపడుతుంది, ఇది క్రమంగా మిగిలిన కణజాలాన్ని కూడా వ్యాపిస్తుంది, దీని కారణంగా లివర్ లో రక్త ప్రశరణకు ఆటంకం కలుగుతుంది. దీనితో లివర్ పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదట పెద్దగా లక్షణాలు కనిపించవు, లివర్లోని మిగిలిన కణజాలం కూడా గట్టిబడుతూ ఉంటే, లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. త్వరగా అలసిపోవడం, ఆకలి తగ్గిపోవడం, చర్మం పాలిపోయినట్లు మారడం, చర్మం మొత్తం కమిలిపోవడం, రంగు మారడం, మొదలైనవి దీనికి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. శరీరంలోని ద్రవాలు బయటకు వెళ్లకుండా ఉండటం వలన కడుపు, మరియు కళ్ళు ఉబ్బిపోవడం, మరియు వికారం, శరీరం మొద్దుబారినట్లు అవ్వడం, మొదలైనవి దీనికి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

 

ఇలా కాలేయం గట్టిపడటానికి చాలా విషయాలు కారణం కావచ్చు. ముందుగా అతిగా మద్యం సేవించే వారిలో ఈ సమస్య ఎక్కువుగా గమనించవచ్చు. మద్యం తాగడం మూలాన కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది, ఇది క్రమంగా లివర్ గట్టిపడటానికి కారణమవుతుంది. ఈ ప్రక్రియ నెమ్మదిగా జరగడం వలన తొందరగా గుర్తించలేము, దీనిని గుర్తించే సరికి చాలా వరకు కాలేయం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం అలవాటు ఉన్నవారు, పరిమితి మించకుండా తీసుకుంటే మంచిది.

 

ఇలాగని మద్యం అలవాటు ఉన్నవారిలోనే లివర్ గట్టిపడుతుందా అంటే దానికి సమాధానం కాదు అని చెప్పాలి. మద్యం సేవించని వారిలో కూడా లివర్ సిరోసిస్ రావడానికి, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, మొదలైన సమస్యల వలన కూడా ఈ లివర్ సిరోసిస్ రావడానికి ఆస్కారం ఉంది. దీనితోపాటు హెపటైసిస్-సి ఇంజెక్షన్లు ఆరు నెలలకంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగిస్తే, అది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లకు దారి తీసి, లివర్ గట్టిపడటానికి కారణమవుతుంది. నొప్పులు తగ్గడానికి వాడే మేథట్రిక్సెట్ మొదలైన మందులు కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కొన్ని రకాల యాంటీబియోటిక్స్ కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్లను దెబ్బతీసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ విధంగా ఎన్నో రకాల కారణాల వల్ల లివర్ సిరోసిస్ రావచ్చు.

లివర్ సిరోసిస్ ఉందనే లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చెయ్యకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి, మెరుగైన చికిత్స తీసుకోవాలి. కాలేయంలో అప్పటికే పడిన మచ్చ భాగాన్ని తగ్గించడం అసాధ్యం, అయితే పడిన మచ్చ భాగం మిగిలిన కణాలకు చేరకుండా చికిత్స తీసుకోవచ్చు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు లివర్ చుట్టూ కొవ్వు చేరకుండా చూసుకోవాలి, బరువు అధికంగా ఉన్నవారు మరియు కొలెస్త్రోల్ ఉన్నవారు, ఆహార నిమాలను పాటిస్తూ ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine