సికిల్ సెల్ అనేమియా అనేది జన్యుపరమైన వ్యాధి, ఇది తల్లిదండ్రుల నుండి పిల్లలకి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో ఎన్నో రకాల ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడం సహజం. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చెయ్యడానికి లేదు, ఎందుకంటే వ్యాధి సోకిన వారు సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ అనేమియా గలవారిలో 50% కంటే ఎక్కువ మంది దేశంలోనే ఉన్నారు. ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేక ప్రతీ ఏడాది ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించి. చికిత్స అవసరమైన వారికి మెరుగైన చికిత్స అందించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ సికిల్ సెల్ అనేమియా నిర్ములన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ వ్యాధి ఎందుకు అంత ప్రమాదకారి మరియు ఈ వ్యాధి ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి శరీరంలో రక్తం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రక్తం ఎన్నో రకాల కణాల సమ్మేళనం. రక్తంలోని ఎర్ర రక్త కణాలు శరీరం మొత్తం ప్రవాయువైన ఆక్సిజన్ సరఫరా చెయ్యడంలో తోడ్పడుతుంది. అయితే ఇందుకోసం ఈ కణాలు మృదువుగాను మరియు గుండ్రంగానూ ఉండాలి. కానీ సికిల్ వ్యాధి గ్రస్తుల్లో జన్యు పరమైన లోపల కారణంగా ఇవి కొడవలి ఆకారంలోకి మారతాయి, దీని వలన కణాలకు అవసరమైన ప్రాణవాయువును అందించలేవు. అంతేకాకుండా కొడవలి ఆకారంలో ఈ రక్త కణాలు గట్టిగాను మరియు జిగటగాను మారి రక్త నాళాల్లో పేరుకుపోతాయి, దీని వలన విపరీతమైన నొప్పి కలుగుతుంది, దీనితోపాటు గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా పెరుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ అనేమియాతో బాధపడేవారిలో 50% మంది మన దేశంలోనే ఉన్నారు. కొన్ని అధ్యనాల ప్రకారం ఈ వ్యాధి ఎక్కువుగా కొండా ప్రాంతాల్లో నివసించే షెడ్యూల్ తెగల్లో ఎక్కువుగా వస్తుందని తెలిసింది. ఎర్ర రక్త కణాలు చెందమామ లేదా కొడవలి ఆకారంలోకి మారడం మూలాన రక్త సరఫరా కు అంతరాయం కలుగుతుంది, ఇలా రక్తం నిలిచినా ప్రాంతాల్లో నొప్పి రావడం గమనించవచ్చు. ఈ వ్యాధితో పుట్టిన చిన్నపిల్లలు 20% రెండు సంవత్సరాల వయసు రాకముందే ప్రాణాలు కోల్పోతారు. మరియు 30% మంది యుక్త వయసుకు రాగానే చనిపోతారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ ఇన్ఫెక్షన్ల భారిన పడటం ఈ మరణాలకు ప్రధాన కారణం.
ఈ వ్యాధి ఉన్నవారు దీనిని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి, ఈ వ్యాధి ఉందని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సికిల్ సెల్ అనేమియా ఉన్నవారిలో ఛాతి, కడుపు మరియు కీళ్ల భాగాలలో ఎక్కువుగా నొప్పివస్తుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కాక ఎల్లపుడు నిరసంగా ఉండటం, రక్త సరఫరా తగ్గిపోవడం వలన కళ్ళు మరియు చేతుల్లో వాపులు రావడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు. కళ్ళలోని రక్తనాళాలకు సర్రిగ్గా రక్తం అందక కంటి చూపు తగ్గిపోతుంది. సికిల్ సెల్ అనేమియా ఉన్నవారిలో రోగనిరోధక శక్తీ క్షిణించడం వలన తరచు ఇన్ఫెక్షన్ల భారిన పడటం, ఫ్లూ, నిమోనియా వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న పిల్లల్లో ఎదుగుదల పూర్తిగా లోపిస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించగానే వైద్యుణ్ణి సంప్రదించి తగిన పరీక్షలు చేపించుకొని, అవసరమైన చికిత్స తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు.
No tags to search
Share your comments