Health & Lifestyle

పండ్లను ఏ సమయంలో తింటే మంచిది?

KJ Staff
KJ Staff

రోగాల భారిన పడకుండా, ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో పండ్లు ముఖ్యమైనవి. పండ్లలో శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పళ్లలో ఉంటాయి. వీటిని ప్రతీ రోజు తిండం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు పళ్ళు ఎక్కువగా తింటారు. అయితే పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసివైన వీటిని తినడానికి కూడా ఒక ప్రత్యేక సమయం అంటూ ఉంటుంది. పళ్ళు ఏ సమయంలో తినాలి, ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

 

పళ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని మూలంగా వీటిని, ఆహారంతోపాటు తినడం మంచిది కాదు. భారీగా ఆహారం తిన్న తరువాత కూడా పళ్ళను తినడం మంచిది కాదు. ఎందుకంటే భోజనంతోపాటు పళ్లను తింటే ఆహారం త్వరగా జీర్ణం కాదు, దీనితోపాటు పొట్టలో ఆహారం పులిసిపోయి కొన్ని రకాల ఆమ్లాలు ఉత్పత్తవుతాయి. ఈ ఆమ్లాలు ఆహార శోషణలో ఆటకం కలిగించి జీర్ణక్రియలో కొన్ని మార్పులు జరిగేలా చేస్తుంది. కాబట్టి భోజనం చేసిన తరువాత మరియు అధిక మొత్తంలో ఆహారం తిన్నసమయంలో పళ్ళను తినడం మంచిది కాదు.

అయితే పండ్లను ఎటువంటి సమయంలో తినాలి అన్న ఆలోచన అందరికి వచ్చే ఉంటుంది. పళ్ళను భోజంతో కలిపి కాకుండా, భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తరువాత మాత్రమే పళ్ళను తినాలి. చాలామంది పళ్ళను జ్యూస్ లాగా చేసుకొని తీసుకుంటారు, ఇలా చెయ్యడం వలన పళ్లలోని ఫైబర్ మొత్తం పోతుంది. దీని వలన రక్తంలో చెక్కెర స్థాయి పెరిగిపోతుంది, కాబట్టి పళ్ళను నేరుగా తినడమే మంచిది. దీనితోపాటుగా, పిల్లను పాలు మరియు పెరుగుతో కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు.

సాధారణంగా చాలా మంది ఉడయన్నే టిఫిన్ తినేందుకు సమయం లేనివారు పళ్లను తిని కడుపునింపుకుంటారు. ఉదయాన్నే కాళీ కడుపుతో పళ్లను తినడం మంచిది కాదు. ఇలా తినడం ద్వారా పొట్టలో గ్యాస్ పెరగడంతోపాటు, ఇతర జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పళ్ళను పాలతో కలిపి తీసుకోవాలి అనుకునేవారు, బాగా పండిన పళ్ళను మాత్రమే తీసుకోవాలి, పచ్చి పళ్ళు పాలతో కలిపి తీసుకుంటే అజీర్తి చేస్తుంది. ఈ విధంగా పళ్లను తీసుకోవడంలో కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తే జీర్ణసమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

Share your comments

Subscribe Magazine