Health & Lifestyle

బడ్జెట్ తయారీకి మరియు హల్వాకి ఉన్న సంభంధం ఏమిటి?

KJ Staff
KJ Staff

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విడుదల చేసింది. బడ్జెట్ అనగానే అందరి మదిలో, ఏ రంగానికి ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు అన్న ప్రశ్న తలెత్తడం సహజం. అయితే కొందరికి మాత్రం బడ్జెట్ అనగానే గుర్తొచ్చేది హల్వా, ఎందుకంటే ఈ తీపి వంటకం తయారుచేసిన తరువాతే బడ్జెట్ పేపర్లను ముద్రిస్తారు.

కేంద్ర ఆర్ధికశాఖ బడ్జెట్ రూపొందించగానే, దానిని ముద్రించే ముందు హాల్వా తయారుచేసి నోటిని తీపిచేసుకున్న తరువాతే బడ్జెట్ కు సంబంధించిన పేపర్లను ముద్రిస్తారు. ఈ సంప్రాదయాన్ని కొన్ని దశాబ్దాల నుండి పాటిస్తూవస్తున్నారు. అయితే చాలా మందికి బడ్జెట్ కి మరియు హల్వా తయారీకి ఉన్న సంబంధం ఏమిటి అన్న సందేహం ఉంటుంది, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి కార్యాలయంలో హల్వా తయారీ వేడుక నిర్వహించి, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సమక్షంలో హల్వాను సిబ్బందికి మొత్తానికి పంచారు. ఎప్పటినుండో వస్తున్న ఈ సంప్రదాయానికి ఒక కారణం ఉంది. ముందుగా బడ్జెట్ పేపర్లను ముద్రించే సిబంది కొన్ని రోజుల పాటు కేంద్ర కార్యాలయంలోనే ఉండి బడ్జెట్ ముద్రించవలసి ఉంటుంది. బడ్జెట్ పేపర్లు ముద్రించడం పూర్తయిన తరువాత మాత్రమే ససిబ్బంది బయటకి వస్తారు. బడ్జెట్ ముద్రించే సమయంలో సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఉండదు. ఈ సమయలో వారు ఎంతో ఒత్తిడిలో ఉంటారు కాబట్టి, మొదట వారిని కొంత సంతృప్తి పారించేందుకు , మొదట హల్వాతో వారి నోటిని తీపి చేస్తారు.

సాధారణంగా ఏదైనా మంచి పనిచేసేటప్పుడు, లేదంటే పండగల సమయంలో స్వీట్లు ఉండాల్సిందే. నోటిని తీపిచేసుకోవడం ద్వారా మన చేసే పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్ముతారు. అదే విధంగా బడ్జెట్ మన దేశ ఆర్ధిక ప్రగతికి, మరియు రాబోయే కాలానికి, బలమైన బాటలు వెయ్యడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేశ ఆర్ధిక వికాసానికి తోడ్పడే బడ్జెట్ పండుగ వంటిదే కాబట్టి, హల్వాతో నోటిని తీపి చేసుకొని ప్రారంభిస్తారు.

Share your comments

Subscribe Magazine