Health & Lifestyle

సాధారణ దగ్గు మరియు టీబీ దగ్గుకు మధ్య తేడాను గుర్తించడం ఎలా?

KJ Staff
KJ Staff

ప్రపంచంలో ఎంతో మంది ఈ టీబీ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. టీబీ దీనినే క్షయ వ్యాధి అని కూడా అంటారు, ఈ వ్యాధి ఉపిరితిత్తులకు సోకుతుంది, మరియు ఒకరినుండి మరొకరికి సోకె ఇన్ఫెక్షన్ లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే టీబీ వ్యాధిని చికిత్స ద్వారా నయం చెయ్యవచు, కానీ ఈ వ్యాధిని గుర్తించడం ఆలాస్యం అవితే వ్యాధి ముదిరిన తరువాత చికిత్స తీసుకున్నాసరే ఫలితం లేకుండా పోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతిఏడాది 10 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి భారిన పడుతున్నట్లు పేర్కొంది. సరైన సమయంలో చికిత్స తీసుకోని కారణంగా దాదాపు 1.5 కోట్ల మంది జనం ప్రాణాలు కోల్పోతున్నారు.

టీబీ లేదా క్షయ వ్యాధిని ముందుగానే గుర్థించి చికిత్స పొందాలి, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీబీ ఉన్నవారికి దగ్గు ఎక్కువగా వస్తుంది, అయితే సాధారణ దగ్గుకి మరియు టీబీ దగ్గుకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం టీబీ దగ్గు లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, దానికి తగట్టు చికిత్స పొంది ప్రాణాలు కాపాడుచు అని చెబుతున్నారు. ముందుగా టీబీ దగ్గుకి మరియు సాధారణ దగ్గుకి మధ్య ఎంతో తేడా ఉంటుంది, సాధారణ దగ్గు ఎక్కువ శాతం రెండువారాల్లో తగ్గిపోతుంది, కానీ టీబీ వలన వచ్చే దగ్గు రెండు వారాలకంటే ఎక్కువ రోజులు ఉంటుంది, అంతేకాకుండా అధిక మొత్తంలో కఫం మరికొన్ని సార్లు కఫంలో రక్తం కూడా వస్తుంది, ఇటువంటి సమయంలో వైద్యుణ్ణి సంప్రదించి మెరుగైన చికిత్స పొందవలసిన అవసరం ఉంది.

టీబీ ఉన్నవారికి దగ్గుతో పాటు మరికొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీరి ఉపిరితిత్తుల్లో మరియు ఛాతి కుహురంలో ద్రవం పేరుకుపోతుంది, దీనివలన చాతి నొప్పి రావడం మరియు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా టీబీ వ్యాధి ముదిరేకొద్దీ ఉన్నటుంది బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం మరియు రాత్రి సమయంలో చెమటతో కూడిన జ్వరం రావడం మరికొన్ని ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి లేదంటే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు.

అయితే ఈ టీబీ వ్యాధిని రాకుండా అడ్డుకునే టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం, బాసిల్లస్ కల్మెట్ గెరిన్ టీకా అందుబాటులో ఉంది. ఈ టీకా వ్యాధికి కారణమయ్యే బాక్టీరియా అభివృద్ధి కాకుండా నిరోధించి, వ్యాధి తీవ్రం కాకుండా కాపాడుతుంది, కాకపోతే ఈ టీకా వ్యాధిని పూర్తిగా నివారించలేదు. ప్రస్తుతం టీబీ వ్యాధి పై పోరాడగలిగే 11 వాక్సిన్స్ అభివృద్ధి చేసే ప్రయత్నంలో శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఈ పరిశోధన విజయవంతమైతే తొందర్లోనే టీబీ రహిత ప్రపంచాన్ని చూడవచ్చు.

Share your comments

Subscribe Magazine