మనం ఆహారంలో వాడే అనేక పదార్ధాల్లో ఇంగువ ఒకటి, దీనినే అసెఫాటోడియా అని కూడా పిలుస్తారు. ఇంగువ ఒక ఘాటైన సుగంధద్రవ్యం, దీని వాసన ఎంతో ఘాటుగా ఉండటం మూలాన దీనిని తినడానికి ఇష్టపడరు, ఇది ఆహారం యొక్క రుచిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అనేక మసాలాలు తయారీలోనూ ఇంగువను వినియోగిస్తారు. ఇంగువ పొడి రూపంలో మరియు ముద్దగా లభిస్తుంది. అయితే మన చాలామందికి ఇంగువ ఎక్కడి నుండి వస్తుందన్న సందేహం ఉంటుంది, ఫెర్యుల అసెఫాటోడియా అనే మొక్క వేర్ల నుండి సేకరిస్తారు, ఈ మొక్క వేర్ల నుండి వచ్చే జిగురు పదార్ధాన్ని ప్రాసెస్ చెయ్యగా వచ్చిందే ఈ ఇంగువ.
అయితే వంటకాలకు టేస్ట్ పెంచడానికి ఉపయోగపడే ఈ ఇంగువలో ఎన్నో ఔషధగుణాలు కూడా ఉన్నాయి. మన తరచూ చేసుకునే పులిహార, రసం, సాంబార్, మరియు నిల్వ పచ్చళ్లలో ఈ ఇంగువను ఎక్కువుగా వాడతారు, దీని వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంది. ఇంగువ తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతారు. అంతేకాకుండా దగ్గు మరియు జలుబు వంటి సమస్యలు రాకుండా నివారించగలిగే శక్తీ ఇంగువకు ఉంది.
ఇంగువ మన ఆహారంలో ఎప్పటినుండో ఒక భాగం. మన రోజువారీ ఆహారంలో ఒక చిటికెడు ఇంగువను జతచేర్చడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంగువలో ఉండే ఔషధ గుణాలు మన రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఇంగువను క్రమం తప్పకుండ తీసుకోవడం మూలాన ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొద్దుకడుపులో నొప్పి తగ్గడానికి ఇంగువ ఎంతో తోడ్పడుతుంది, కొంచెం ఇంగువను బెల్లంతో కలిపి తింటే, ఈ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది, అంతేకాకుండా ఇలా తినడం వలన నులిపురుగుల సమస్యకూడా తగ్గుతుంది. భోజనం అయిన తరువాత బెల్లంతో కొంచెం ఇంగువను తినడం ద్వారా అజీర్తి సమస్యలు ఉండవు.
ఆహారానికి రుచిని పెంచే ఇంగువలో, యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంటను తగ్గించడం, మరియు వాపును కూడా తగ్గిస్తాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఇంగువ తినడం వలన ఈ సమస్య దూరంచేసుకోవచ్చు. ఇంగువలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి మనల్ని రోగాలకు దూరంగా ఉంచుతాయి, హానికారక బాక్టీరియా తో పోరాడి వాటిని నివారిస్తాయి. ఇంగువ తినడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే ఇంగువను కొద్దీ పరిమాణంలోనే తీసుకోవాలి, ఎక్కువగా తింటే విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది.
Share your comments