మన పురాతన భారతీయఆయుర్వేద వైద్యంలో అనేక వ్యాధులకు చక్కటి పరిష్కార మార్గం చూపబడింది. ఆయుర్వేద వైద్యంతో వ్యాధి తగ్గడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. మన ఇంట్లో దొరికే లేదా ఇంటి పరిసరాల్లో పుష్కలంగా లభించే వనరులను ఉపయోగించి చిన్నచిన్న వ్యాధులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేసుకోవచ్చు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అవడంతో శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. పైగా కరోనా ఉధృతి కారణంగా ప్రతి చిన్న సమస్యకు బయటికి వెళ్లి వైద్యం తీసుకోవడం కూడా మంచిది కాదు.కాబట్టి మన ఇంట్లోనే సహజంగా లభించే వాటితో చిన్న చిట్కాలు పాటించి శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి ఇప్పుడు చూద్దాం.
*ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండే మిరియాలను కషాయంగా చేసి అందులో తేనె కలుపుకుని తాగితే శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే అల్లం రసం తేనెతో కలిపి సేవించినా శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
*పల్లెటూర్లలో విరివిగా పెరిగే జిల్లేడు మొక్కల నుంచి జిల్లేడు మొగ్గలను సేకరించి వాటిని కషాయంగా చేసి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు,దమ్ము, జలుబు మొదలైన శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
*ఎన్నో ఔషధ గుణాలున్న మద్దిచెక్క చూర్ణంను పాలలో కలుపుకుని సేవిస్తే శ్వాస వ్యాధుల మంచి రక్షణ పొందవచ్చు. ఇలా ప్రకృతి మనకు ప్రసాదించిన వనమూలికలను ఉపయోగించి సహజంగా కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
Share your comments