ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఎంతో ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో చాలా మంది ప్రజలు ఎక్కువగా అన్నం పై ఆధార పడతాము. ఈ క్రమంలోనే మనదేశంలో వరి ప్రధాన ఆహార పంటగా సాగు చేస్తున్నారు. అయితే మన రాష్ట్రాలలో ఎక్కువగా తెలుగు బియ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఎర్ర బియ్యం, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ వంటి రకాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో ఏ బియ్యం ఆరోగ్యానికి మంచివి.. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం
ప్రస్తుతం మార్కెట్లో మనకు అధికంగా లభిస్తున్న వాటిలో తెల్ల బియ్యం ఒకటి. తెల్ల బియ్యాన్ని ఎంతోమంది ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎక్కువగా
యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, థయామిన్, విటమిన్లు ఉంటాయి. ఇది కాకుండా తెల్ల బియ్యంలో ఫైబర్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఈ బియ్యాన్ని ఎక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ చేయటం వల్ల ఇందులో ఉన్న పోషకాలు పూర్తిగా కోల్పోతాము.
బ్రౌన్ రైస్ తెల్ల బియ్యం కంటే ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మధుమేహంతో బాధపడేవారికి బ్రౌన్ రైస్ ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు.
నల్ల బియ్యాన్ని పర్పుల్ రైస్ అని కూడా పిలుస్తారు. ఈ బియ్యానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ కారణంగా ఈ బియ్యం నలుపు రంగును కలిగి ఉంటాయి. ఈ నల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.అదే విధంగా అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మన శరీరంలో ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడానికి దోహదపడుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహులు ఈ బియ్యాన్ని ఎక్కువగా తినవచ్చు.
రెడ్ రైస్ లో ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీనిలో పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది.బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర బియ్యం ఎంతో ప్రయోజనకరమైన చెప్పవచ్చు. ఇది గుండె వ్యాధులను తగ్గించడానికి కూడా దోహదం చేస్తుంది. ఈ నాలుగు రకాల బియ్యాల లో రెడ్, బ్రౌన్, బ్లాక్ రైస్ ఎంతో ఆరోగ్యవంతమైనవని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు.
Share your comments