సహజంగా తీపిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.ప్రతిరోజు కాఫీ, టీ ,వివిధ రకాల పండ్ల రసాలు, స్వీట్స్, చాక్లెట్స్ వంటివాటిలో తియ్యదనం కోసం చక్కెరను ఎక్కువగా వాడుతారు. ప్రతిరోజూ మోతాదుకు మించి చక్కెరతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ప్రతికూల ప్రభావం చూపి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది.అందుకే చక్కెరను వైట్ పాయిజన్ గా పిలుస్తారు.
చక్కరతో చేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దాంతో శరీర బరువు పెరిగి ఊబకాయు సమస్యతో బాధపడే అవకాశం ఉంది. ప్రధానంగా యువత చాక్లెట్స్, శీతల పానీయాలు, స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు.అలాగే చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి ప్రమాదకర డయాబెటిస్ వ్యాధికి కారణమవుతుంది.
చక్కెరలో శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఏవి ఉండవు.శరీరంలోకి అధిక మోతాదులో చక్కెర చేరినట్టయితే కాలేయం పై ఒత్తిడి పెరిగి దెబ్బతింటుంది. శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బుల బారినపడుతారు.చక్కెర మీశరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది కావున గ్లూకోజ్ పూర్తిగా మెదడుకు చేరదు దాంతో మెదడు పనితీరు దెబ్బతిని జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి సమస్యలు ఏర్పడతాయి.తీపి పదార్థాలు తినడం వల్ల దంతక్షయం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కావున సాధ్యమైనంతవరకు మన ఆహారంలో చక్కర స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది.చక్కెర ను అధికంగా తీసుకోవడం వల్ల ఇన్ని సమస్యలు తలెత్తుతాయి కనుక చక్కెరను వైట్ పాయిజన్ అని పిలుస్తారు.
Share your comments