ప్రతి సంవత్సరం మార్చ్ 30 న ప్రపంచ ఇడ్లి దినోత్సవంగా జరుపుకుంటారు అయితే ఈ ఇడ్లి మొదట ఎవరు తయారు చేసారు, ప్రపంచ ఇడ్లి దినోత్సవం వెనక ఉన్న కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
భారతీయలు ఎక్కువగా ఇష్టపడే అల్పాహారంలో ఖచ్చితంగా ఇడ్లి ఉంటుంది. వేడి వేడి సాంబార్ లేక పల్లి చట్నీతో కలిపి తినడానికి ఇష్టపడుతారు. నీటి ఆవిరి తో తయారయ్యే ఇడ్లి ఎంతో మృదువుగా ఉంటుంది. రుచిగా ఉండటమే కాకుండా జీర్ణం కూడా త్వరగా అవుతుంది,ఆరోగ్యానికి మంచిది కూడా.ప్రపంచ ఇడ్లి దినోత్సవం వెనక వున్న ఆసక్తికర విషయాన్ని తెలుసుకుందాం. ఇది 2015 సంవత్సరం మార్చ్ 30న ప్రారంభమైంది. చెన్నై కి చెందిన ఏనీయవన్ అనే ఇడ్లి క్యాటరర్ ఈ వేడుకని ప్రారంభించాడు ఎనియావన్ 2015లో దాదాపు 1,328 రకాల ఇడ్లీలను తయారు చేశాడు. అదే రోజు ఒక 44 కిలోల పెద్ద ఇడ్లీని తయారు చేసి ఇడ్లి పై తనకున్న ఇష్టాన్ని చాటి చెప్పాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ భారీ ఇడ్లిని కట్ చేసాడు అప్పటి నుండి మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.
ఇడ్లిని మొదటగా ఏ దేశస్థులు తయారు చేసారు?
ఇడ్లిని భారతీయులందరు అల్పాహారం లో ఎంతో ఇష్టంగా తింటారు దీనికి దేశ వ్యాప్తంగా ఏంతో ప్రాముఖ్యత వుంది. ఇక్కడ
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇడ్లిని మొదటగా తయారు చేసింది భారతీయులు కాదు. ఇడ్లీ కి మూలం ఇండోనేషియా దేశం అని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ వంటకం 800 నుండి 1200 CE నాటి కాలంలో భారతదేశానికి వచ్చిందని భావిస్తున్నారు. మీరు కూడా ఇడ్లీ ప్రియులు అయితే ఈ రోజు ఇడ్లీని వండి ఇడ్లీ దినోత్సవాన్ని జరుపుకోండి.
మరిన్ని చదవండి.
Share your comments