Health & Lifestyle

మధుమేహానికి యోగాతో చెక్ పెట్టండిలా...

KJ Staff
KJ Staff

మధుమేహం రావడానికి అనేక కారణాలున్నాయి. ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కూడా మధుమేహం రావడానికి కారణం కావచ్చు. భవిష్యత్తులో మధుమేహం భారిన పడకుండా జీవనశైలిలో మార్పులతోపాటు, యోగాను కూడా అలవాటు చేసుకోవాలి. యోగా సాధనతో ఎన్నో రోగాలను అదుపు చెయ్యవచ్చు. ఎంతోమంది వైద్య నిపుణులు కూడా యోగ చెయ్యడం మంచిదని సూచిస్తున్నారు.

రక్తంలో చెక్కెర స్థాయి నియంత్రణ లేకుండా పెరిగిపోవడాన్నీ షుగర్ వ్యాధిగా పరిగణిస్తారు. రక్తంలో గగ్లూకోజ్ స్థాయి ఎక్కువుగా ఉన్నా, మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో లేకపోతే దానిని ప్రీ డయాబెటిక్ కండిషన్ గా పరిగణిస్తారు. ఈ దశలో ఉన్నవారు మందులు వాడవలసిన అవసరం ఉండదు, అయితే వీరు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చెయ్యవలసి ఉంటుంది, వాటిలో ఆహారంలో పిండి పదార్ధాలు మరియు కొవ్వు ఎక్కువుగా ఉండే ఆహారం తగ్గించడం, అదేవిధంగా బరువు ఎక్కువుగా ఉన్నవారు వ్యాయామం చెయ్యడం ద్వారా బరువు తగ్గడం వంటివి చెయ్యాలి. ఈ విధంగా పూర్తిస్థాయిలో మధుమేహం భారిన పడకుండా నియంత్రించవచ్చు.

మధుమేహం రాకుండా ఉండటానికి శారీరిక వ్యాయామం చాలా అవసరం. మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. యోగ చెయ్యడం ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని నిరూపించాడనికి మనదేశంలోని ఐదు వైద్య సంస్థలు అధ్యయనం నిర్వహించింది. వీరిలో శరీర బరువు మరియు ఎత్తు నిష్పత్తి 23 గల 30-70 ఏళ్ల వయసుతో =, ముందస్తు మధుమేహం ఉన్నవారిని ఎంచుకున్నారు. వీరిలో కొందరికి జీవనశైలిలో మార్పులు మరికొందరికి జీవనశైలితోపాటు యోగ కూడా చెయ్యాలని సూచించారు.

జీవనశైలిలో మార్పులు మాత్రమే పాటించినవారిలో 18.9% శాతం మందికి మధుమేహం వచ్చింది. జీవనశైలిలో మార్పులతోపాటు యోగ కూడా పాటించివరిలో 11.5% మందిలో మాత్రమే మధుమేహం వచ్చినట్లు తెలిపారు. దీనిని బట్టి యోగ సాధనతో మధుమేహం భారినపడే ప్రమాదం తక్కువవుతున్నట్లు తెలుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ మూడునెలల సగటు మోతాదును తెలిపే హెచ్బిఏ1సీ, 6 కంటే ఎక్కువుగా ఉన్నవారికి యోగ మేలు చేస్తున్నట్లు బయటపడింది.

మధుమేహం రావడానికి మానశిక ఒత్తిడి కూడా ఒక కారణం కావచ్చు. దీర్ఘకాలం మానశిక ఒత్తిడితో, హైపోథలామస్, పిట్యూటరీ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, ప్రేరేపితం కావడం ముఖ్య కారణమని చెబుతున్నారు. యోగాతో మానశిక ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుముఖం పడతాయి, మరోవైపు యోగాసనాలు జన్యు వ్యక్తీకరణను మార్చగాలవు, వీటి మూలంగా కండరాల చురుకుదనం, సామర్ధ్యం మరియు కదలికలు మెరుగవుతాయి, ఫలితంగా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తికి స్పందిస్తాయి. యోగాతో రోగనిరోధక శక్తీ కూడా మెరుగవుతుంది. ఈ విధంగా యోగాతో మధుమేహం నివారణతోపాటు అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Share your comments

Subscribe Magazine