పాల పదార్థాలలో ఒకటైనా పన్నీర్ ను వివిధ రకాల వంటలలో ఉపయోగించడం చేస్తుంటాము. పన్నీర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలము. పాల పదార్థాలలో ఒకటైన పన్నీర్ లో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే తరుచూ పన్నీరు తినడం ద్వారా మన శరీరానికి తగినన్ని పోషకాలు అందడమే కాకుండా పిల్లల ఎదుగుదలకు, పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం కోసం పన్నీరు దోహదపడుతుందని చెప్పవచ్చు.
పన్నీర్ పాలనుంచి తయారు అవుతుంది కనుక అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్లతో పాటు అధిక మొత్తంలో కొవ్వులు కూడా ఉంటాయి. ఆవుపాలలో కేసిన్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్ ఉపయోగించడం ఎంతో ఉత్తమం. వీటిలో ప్రొటీన్లు కొవ్వులతోపాటు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో పిండిపదార్థాలను సులభంగా వేరు చేయబడుతుంది.
పన్నీర్ లో క్యాల్షియం అధిక మొత్తంలో ఉండటంవల్ల ఎముకలు దంతాలు దృఢంగా తయారవడానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి పోషకాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలలో మెదడు పనితీరు జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి, శరీర ఎదుగుదలకు పన్నీర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.
Share your comments