సాధారణంగా మన భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. యాలకులను ఎన్నో రకాల వంటలలో విరివిగా ఉపయోగిస్తారు. యాలకులు వేయటం వల్ల వంటకు రుచి, వాసన మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే వివిధ రకాల స్వీట్లు తయారు చేసుకున్నప్పుడు కూడా యాలకులను ఉపయోగించడం మనం చూస్తుంటాము.మరి యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలోదుమ్ము ధూళి వల్ల ఏర్పడే అనేక సమస్యలకు ఈ యాలకుల ద్వారా చెక్ పెట్టవచ్చని చెప్పవచ్చు.ముఖ్యంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే వారు యాలకులతో తయారు చేసినటువంటి టీ తాగటం వల్ల ఒత్తిడి నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు.అయితే మానసిక ఒత్తిడితో బాధపడే వారు వారు తాగే టీ లో టీ పొడిని తక్కువగా ఉపయోగించి యాలకుల పొడిని విరివిగా ఉపయోగించడం వల్ల నూతన ఉత్సాహంతో పనులను ప్రారంభిస్తారు.
చాలామంది మాంసాహారం తిన్న తర్వాత యాలకులను నోటిలో వేసుకొని నమిలి తింటారు. ఈ విధంగా నమలడం వల్ల నోటిలో ఏర్పడిన క్రిముల వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉండటమే కాకుండా, మనం తీసుకున్న ఆహారం కూడా ఎంతో తేలికగా జీర్ణం అవుతుంది.అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు.
Share your comments