Animal Husbandry

“మత్స్యరంగం అభివృద్ధి పథకానికి టెక్నాలజీ అభివృద్ధి బోర్డు అండ” :తొలి అక్వాకల్చల్ ప్పాజెక్టుకు పూర్తిస్థాయి మద్దతు

Srikanth B
Srikanth B

దేశ ప్రధాన ఉత్పాదనా రంగాల్లో, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో మత్స్యరంగం కూడా ఉంది. ఆర్థికాభివృద్ధిలోనే కాక, దేశం మొత్తం అభివృద్ధిలో మత్స్యరంగం కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. గుణాత్మక అభివృద్ధికి, సత్వర అభివృద్ధికి అవకాశం ఉన్న “సన్‌రైజ్ సెక్టార్”గా మత్స్యరంగం గుర్తింపు పొందింది. సమవృద్ధి, సమ్మిళత అభివృద్ధి ద్వారా ఈ రంగం దేశానికి ఆర్థిక పరిపుష్టిని కూడా అందించబోతోంది.

దేశవ్యాప్తంగా కోటీ 45లక్షల మందికి ఉపాధిని, 2కోట్ల 80లక్షల మంది మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించడానికి శక్తివంతమైన ఛోదకశక్తిగా మత్స్య రంగం గుర్తింపు పొందింది. సాంకేతిక పరిజ్ఞానపరమైన చర్యలు, సృజనాత్మక పరిష్కారాల ద్వారా క్షేత్రస్థాయిలో సవాళ్లను ఎదుర్కొనడానికి, తగిన పరిష్కారాలను అందించడానికి ముందుకు రావలసిందిగా దేశంలోని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ఈ మత్స్యరంగం కోరుతోంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. మత్స్యరంగంలో సుస్థిర, బాధ్యతాయుత అభివృద్ధి ద్వారా ‘నీలి విప్లవం’ తీసుకువచ్చే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై.)’ పేరిట ఒక పథకానికి రూపకల్పన చేశారు. 2024-25వ సంవత్సరానికల్లా దాదాపు 9శాతం వార్షిక వృద్ధిరేటుతో 2.20కోట్ల మెట్రిక్ టన్నులకు చేపల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టారు. ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేయాలని తద్వారా ఆదాయాన్ని లక్షకోట్ల రూపాయలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో మత్స్య రంగంలో 55లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించాలని కూడా ఈ పథకం ద్వారా నిర్దేశించుకున్నారు.


అభివృద్ధి చెందడానికి మత్స్యరంగానికి ఉన్న సామర్థ్యాన్ని కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖకు చెందిన చట్టబద్ధ సంస్థ అయిన టెక్నాలజీ అభివృద్ధి బోర్డు (టి.డి.బి.) గుర్తించింది. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మహారాష్ట్రలోని నవీముంబైకి చెందిన ఫౌంటెన్‌హెడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టుకు టెక్నాలజీ అభివృద్ధి బోర్డు తగిన మద్దతును అందిస్తోంది.
ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ‘అడ్వాన్స్‌డ్, ఇన్‌టెన్సివ్, ఆల్ మేల్ తిలాపియా అక్వాకల్చల్ ప్రాజెక్ట్’ పేరిట చేపట్టిన కార్యక్రమానికి తగిన సహాయ సహకారాలను బోర్డు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కంపెనీకి రూ. 29.78కోట్లు ఖర్చవుతుండగా, అందులో రూ. 8.42కోట్ల రుణ సహాయాన్ని అందించేందుకు పరస్పర అవగాహనా ఒప్పందాన్ని టి.డి.బి. కుదుర్చుకుంది. ‘తిలాపియా’ అనేది, ఎంతో ఉత్పాదకత కలిగిన, అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు కలిగిన చేపగా ఇపుడు రూపుదాల్చింది.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన:చేపల పెంపకానికి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీ

తిలాపియా రకం చేపల పెంపకం ప్రపంచంలోని అనేక దేశాల్లో వాణిజ్యపరంగా ప్రజాదరణ పొందింది. వేగంగా పెరగడం, పెంపకం ఖర్చు తక్కువగా ఉండటం కారణంగా, తిలాపియాను “అక్వాటిక్ చికెన్”గా మత్స్యరంగం నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ రోజున ప్రపంచ స్థాయిలో పేరుపొందిన చేప తిలాపియా తప్ప మరొకటి కనిపించడం లేదు.

భారతదేశంలో తిలాపియా చేపల సాగును, పెంపకాన్ని బాధ్యతాయుతంగా చేపట్టేందుకు ఫౌంటెన్‌హెడ్ ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక పరిపూర్ణమైన ఉత్పదకా వ్యవస్థను (అండదశనుంచి చేపదశకు ఎదిగేంతవకూ వరకూ) కర్ణాటక రాష్ట్రంలోని ముధోల్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇజ్రాయెల్‌లోని నిర్ డేవిడ్ ఫిష్ బ్రీడింగ్ ఫార్మ్‌కు చెందిన హెర్మన్ నిల్వలనుంచి దిగుమతి చేసుకుని ఈ సాగును చేపడతారు.

500 టన్నుల తిలాపియా చేపలను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. తిలాపియా రకానికి చెందిన ఒరియో క్రోమిస్ నిలోటికస్ (మగజాతి), ఒరియో క్రోమిస్ ఔరియస్ (ఆడజాతి) సంకర చేపలను హెర్మన్‌నుంచి తెప్పిస్తారు. ఎక్కువ వృద్ధి రేటు, తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలగడం, కాంతివంతమైన (ఆకర్షణీయమైన) రంగును కలిగి ఉండటం వంటివి ఈ చేపల ప్రత్యేక లక్షణాలు.

చేపల పెంపకం, ఉత్పత్తిలో ఇజ్రాయెల్ దేశానికి చెందిన అక్వాకల్చల్ ప్రొడక్షన్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎ.పి.టి.ఐ.ఎల్.) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కంపెనీ చేపట్టింది. 2020వ సంవత్సరంలో కుదిరిన టెక్నాలజీ సర్వీస్ ఒప్పందం ప్రకారం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ చేపట్టింది. తీరప్రాంతంతో అనుసంధానంకాని భూభాగాల్లోని మెట్టప్రాంతాల్లో నదులనుంచి సీజన్‌లో మాత్రమే అందే నీటి సరఫరాతో చేపల సాగును చేపట్టేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే సాగును హేతుబద్ధమైన నీటి వనరుల సహాయంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చేపట్టే అవకాశం ఉంది.

 

రాజేశ్ కుమార్ పాఠక్, కార్యదర్శి, టెక్నాలజీ అభివృద్ధి బోర్డు:

“మత్స్య రంగంపై భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపుతోంది. నీలి విప్లవం ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. మత్స్యరంగానికి, ప్రత్యేకించి, ‘తిలాపియా చేప’కు ఎగుమతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్‌లో తిలాపియా రకానికి భారీ స్థాయి గిరాకీ ఉన్న నేపథ్యంలో, దీనికి ఎగుమతి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మత్స్య రంగంలో ఎగుమతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, లక్షకోట్ల రూపాయలకు చేర్చేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై.) పేరిట చేపట్టినపథకానికి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానం అదనపు సదుపాయంగా ఉపయోగపడనున్నది.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన:చేపల పెంపకానికి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీ

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More