Health & Lifestyle

ఔషధ గుణాలు కలిగినటువంటి బిళ్ళగన్నేరు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

KJ Staff
KJ Staff

ఈ ప్రకృతిలో మనిషికి ఎన్నో అవసరమైన ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు విరివిగా ఉన్నాయి.ఈ మొక్కల ద్వారా లభించే ఔషధ గుణాలు మనలో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలను తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో మన జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.ముఖ్యంగా అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ విధమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టడానికి బిళ్ళగన్నేరు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి బిళ్ళగన్నేరులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?బిల్లగన్నేరు ద్వారా ఎలాంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా బిళ్ళగన్నేరు మొక్క మన ఇంటిలో అలంకరణ కోసం పెంచుకుంటాం.దీని పువ్వులు గులాబి,తెలుపు రంగులో ఉంటాయి.ఈ మొక్క వేరు నుంచి ఆకులు,పువ్వులు వరుకు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ మొక్క వేర్లను తీసుకువచ్చి ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని ఆ పొడిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం అరటీ స్పూన్ పొడిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.అదేవిధంగా ఆపొడితో డికాషన్ తయారు చేసుకోని తాగటం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. అదే విధంగా ఈ బిల్లగన్నేరు ఆకుల నుంచి తీసిన రసం ప్రతి రోజు తాగడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు.

బిళ్ళగన్నేరు ఆకులను శుభ్రం చేసి వాటి నుంచి తీసిన రసం ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నాలుగు నుంచి ఐదు బిళ్ళగన్నేరు ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిన ఈ నీటిని తాగటం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine