Health & Lifestyle

చైనాలో కలకలం రేపుతున్న మంకీ బీ వైరస్.. ఒకరు మృతి!

KJ Staff
KJ Staff

కరోనా వైరస్ పుట్టిల్లుగా ఎంతో పేరు సంపాదించుకున్న చైనాలో మరొక కొత్త వైరస్ వ్యాప్తి చెందుతూ యావత్ దేశాల అన్నింటిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కొత్తగా మంకీ బీ వైరస్ వ్యాప్తి చెంది ఒక వెటర్నరీ వైద్య అధికారి మరణించడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వెటర్నరీ వైద్యుడు చనిపోయిన రెండు కోతులకు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత తాను తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఈ విధంగా మంకీ బీ వైరస్ వ్యాప్తి చెంది చనిపోయిన వైద్యుడు సన్నిహితులకు,కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా వారెవరు ఈ వైరస్ బారిన పడలేదు.ఈ విధంగా కోతుల ద్వారా వైరస్ వ్యాపించడంతో సదరు డాక్టర్ తీవ్రమైన వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించడంతో మరణించాడని వైద్యులు తెలిపారు.

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఈ మంకీ బీ వైరస్ ను
1932లో కనిపెట్టారు.ఇప్పటికీ ఈ విధమైనటువంటి వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి ఎటువంటి మందులు అందుబాటులో లేవు. ఈ వైరస్ మనిషి పై వ్యాప్తి చెందినప్పుడు మొట్టమొదటిసారిగా మనిషి కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు తెలియజేశారు. అయితే వైరస్ కరోనా మహమ్మారి మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. అలాగే ఈ మంకీ బీ వైరస్ ఎక్కువగా వెటర్నరీ ఆస్పత్రిలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి మాత్రమే వ్యాప్తి చెందుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి కేవలం యాంటీ వైరల్ మందుల ద్వారా మాత్రమే చికిత్స అందిస్తారు.

Share your comments

Subscribe Magazine