Health & Lifestyle

చర్మ క్యాన్సర్ ను యాంటీబయాటిక్స్ సమర్థవంతంగా ఎదుర్కొంటాయా.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

KJ Staff
KJ Staff

సాధారణంగా క్యాన్సర్ లో ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. వీటిలో చర్మ క్యాన్సర్ ఒకటి. చర్మ క్యాన్సర్ ను మెలనోమా క్యాన్సర్ అని కూడా అంటారు.సాధారణంగా మనం ఏదైనా క్యాన్సర్ బారిన పడితే తప్పకుండా అందుకు సరైన చికిత్స చేయించుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే కీమోథెరపీ చేయడం మనం చూస్తున్నాము.అయితే చర్మ క్యాన్సర్ ను ఎదుర్కోవడానికి యాంటీబయాటిక్స్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని తాజాగా నిపుణులు చేసిన అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.

జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ మెడిసిన్స్‌లో ప్రచురించిన కథనం ప్రకారం యాంటీబయాటిక్స్ చర్మ క్యాన్సర్ ను ఎదుర్కోవడానికి దోహదపడతాయని తెలిపారు. ఎలినోరా లియుసి ప్రకారం.. చర్మంలో పెరుగుతున్న క్యాన్సర్ కణాలు మనం చికిత్స తీసుకునే సమయంలోనూ మందుల ప్రభావం నుంచి తమను తాము రక్షించుకుంటాయని వెల్లడించారు. ఈ విధంగా రక్షించబడిన కణాలే భవిష్యత్తులో కణితులుగా ఏర్పడతాయని తెలిపారు.

ఈ విధమైనటువంటి కణితులను యాంటీబయాటిక్స్ సహాయంతో తొలగించవచ్చని నిపుణులు వెల్లడించారు.ఈ విధంగా చర్మం పై ఏర్పడిన క్యాన్సర్ కణాలను ఎలుకలోకి ప్రవేశపెట్టి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల ఎలుకలలో క్యాన్సర్ కణాలను యాంటీ బయోటిక్స్ పూర్తిగా నశింపజేశాయని కనుగొన్నారు.ఈ ప్రయోగంలో భాగంగా కొన్ని ఔషధాలు ప్రభావం కూడా బ్యాక్టీరియాల పై పడటంతో ఇవి ఎంతో సమర్ధవంతంగా పని చేశాయని నిపుణులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు చర్మ క్యాన్సర్ సూర్యరశ్మి కారణంగా వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.కానీ చర్మ క్యాన్సర్ రావడానికి అసలు కారణం ఏంటని విషయాలు మాత్రం ఇంతవరకు నిరూపితం కాలేదు.

Share your comments

Subscribe Magazine