Health & Lifestyle

మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. వెంటనే తగ్గడానికి ఇలా చేయండి..

Gokavarapu siva
Gokavarapu siva

గతంలో మోకాళ్ళ నొప్పులు అనగానే వయస్సులో పెద్ద వారికి వచ్చేవి. నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి చిన్న వయస్సు నుండే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. సాధారణంగా ఈ మోకాళ్ళ నొప్పులు రావటానికి అనేక రకాల కారణాలు అనేవి ఉంటాయి.

ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు, ఎన్ని రకాల మందులు వాడుతున్న కూడా వారికి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడం లేదు. కానీ ఈ మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఒక సహజ సిద్ధమైన ఉపాయం ఉందది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తగ్గని మోకాళ్ళ నొప్పులు మనం చింతకాయలు, చింతపండు తిని పారేసే చింత గింజలతో తగ్గుతుందని నిరూపితం అయింది.

ఆయుర్వేద అభ్యాసకులు కూడా ఈ ఔషధ నివారణ యొక్క సమర్థతను గుర్తిస్తారు. చింతపండు మరియు చింతపండు గింజలు రెండింటినీ ఉపయోగించి, మోకాళ్ల నొప్పులను తగ్గించే శక్తివంతమైన ఔషధం సృష్టించుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి..

దేశంలో భారీగా పెరిగిన వంట నూనె దిగుమతులు.. ఈ సంవత్సరం ఎంతంటే?

1: చింతపండు గింజలను వేయించాలి.
2. బాగా కాల్చిన చింతపండు గింజలను నీటిలో 2 రోజులు నానబెట్టండి.
3: 2 రోజులు నానబెట్టిన తర్వాత, నీటిని మార్చినప్పుడు వాటి పొట్టు త్వరగా ఊడిపోతాయి.
4: పొట్టులను తొలగించండి. చింతపండు గింజలను చిన్న ముక్కలుగా కోసి బాగా ఎండబెట్టాలి.
5: ఆరిన తర్వాత చింతపండును మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
6: ఈ పొడిని ఒక చెంచా చొప్పున రోజుకు రెండుసార్లు నీళ్లలో లేదా పాలలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల 30 రోజుల్లో మోకాళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు.

ఇది కూడా చదవండి..

దేశంలో భారీగా పెరిగిన వంట నూనె దిగుమతులు.. ఈ సంవత్సరం ఎంతంటే?

Related Topics

knee pains tips

Share your comments

Subscribe Magazine