Health & Lifestyle

విటమిన్లను ఉపయోగిస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు?

KJ Staff
KJ Staff

సాధారణంగా మన ఆరోగ్యానికి విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ విటమిన్లను అధిక మొత్తంలో తీసుకోవాలని చెబుతుంటారు. అయితే విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలను మాత్రమే కాకుండా మనకు విటమిన్ క్యాప్సిల్స్ రూపంలో కూడా మార్కెట్లో లభిస్తాయి. ఈ క్రమంలోనే చాలామంది విటమిన్లను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే విటమిన్లు అధికంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు మనల్ని వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్స్ అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

విటమిన్స్ అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా తయారవటం, ఆకలి మందగించడం కాలేయం వాపు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా మరికొందరిలో వాంతులు ,తలనొప్పి, బరువు తగ్గడం, కిడ్నీలలో కాల్షియం పేరుకుపోవడం వంటివి జరగటం వల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతాయి. కనుక మన శరీరానికి తగిన పరిమాణంలో విటమిన్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం.

సాధారణంగా విటమిన్లు మనకు సహజ సిద్ధంగా ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని టాబ్లెట్ల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆహార పదార్థాలలో కాకుండా టాబ్లెట్ల రూపంలో విటమిన్లు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక వీలైనంత వరకు ఆహార పదార్థాలను తాజాపండ్లు కూరలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్లు సమృద్ధిగా లభించడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.

Share your comments

Subscribe Magazine