Health & Lifestyle

సహజసిద్ధమైన నెయ్యితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

KJ Staff
KJ Staff

సాధారణంగా మన ఆరోగ్యానికి నెయ్యి ఎంతో ప్రయోజనకరమైనది. నీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి అందడం వల్ల సరైన ఆరోగ్యాన్ని పొందుతాము. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది మనకు ఒక ఔషధంగా పనిచేస్తుంది. పొడిబారిన చర్మం కాంతివంతంగా మెరవాలంటే, జుట్టుకు సరైన పోషణ అందించడంలోనూ, కళ్ళ కింద నల్లని వలయాలు తగ్గిపోవడానికి నెయ్యి ఎంతో దోహద పడుతోంది. మరి నెయ్యి వల్ల చర్మ సౌందర్యాన్ని ఏవిధంగా పెంపొందించుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం...

*పొడిబారిన చర్మంతో బాధపడేవారు అర టీ స్పూన్ సహజసిద్ధమైన నెయ్యిలోకి రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, చిటికెడు పసుపు కలిపి బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం ముఖానికి మెడ భాగంలో ప్యాక్ లా అప్లై చేసుకోవడం వల్ల పొడిబారిన చర్మం తేమను కలిగి ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

*కళ్ళ కింద ఏర్పడిన నల్లటి వలయాలను తొలగించుకోవడానికి అర టీస్పూన్ నెయ్యిలోకి అర టీస్పూన్ బంగాళాదుంప రసం కలిపి కాటన్ సహాయముతో కళ్ళకింద సున్నితంగా 20 నిమిషాలపాటు మసాజ్ చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి.

*జుట్టు పోషణ మెరుగుపరుచుకోవడానికి 2 టీస్పూన్ నెయ్యిలోకి రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు ఈ మూడింటిని ఒక మిశ్రమంగా తయారుచేసి జుట్టుకు అంటించి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది.

Share your comments

Subscribe Magazine