Health & Lifestyle

అరటిపండు తొక్కల ప్రత్యేకత మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

సాధారణంగా అరటిపండు తిన్న తర్వాత తొక్కను బయట పడేస్తాం అయితే దీనిలో ఉండే పోషకవిలువలు మీకు తెలిస్తే పొరపాటునకూడా దీనిని బయట పడెయ్యారు. అరటి తొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు తొక్క భాగం మీద మెత్తని పీచు వంటి పదార్ధం ఉంటుంది. వీటిద్వారా చర్మ సౌందర్య పెరిగి మొకం ప్రకాశిస్తుంది. దీని వలన జుట్టుకు కూడా అనేక లాభాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ పీచు వంటి పదార్ధం అనేక పోషక విలువలకు నిలయం. దీనిలో కెరోటినాయిడ్ లు, ఫలవినోయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటుగా శరీర పనితీరు మెరుగుపడటానికి ఉపయోగపడే మాంగనీస్, పొటాషియం లభిస్తాయి. అరటి పళ్ళ తొక్కలు శరీరంలోని మలినాలను బయటకు పంపించి శరీరాన్ని డిటాక్స్ చెయ్యడంలో తోడ్పడతాయి.

అరటి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే పళ్ళ మీద ఉండే పసుపు పచ్చ ఛాయా తొలిగిపోయి, దంతాలు తెల్లగా, నిగారింపుగా కనిపిస్తాయి. వీటిని మొకం మీద మసాజ్ చేస్తే మొకం మీద ఉండే మచ్చలు తగ్గి, కాంతివంతంగా ప్రకాశించడానికి తోడ్పడుతుంది. కళ్లకింద డార్క్ సర్కిల్స్ లేదా ఎటువంటి మచ్చలు ఉన్న ఆ ప్రదేశంలో అరటి తొక్కలు మసాజ్ చేస్తే ఆ మచ్చలు తగ్గడానికి ఆస్కారముంటుంది.

అంతేకాకుండా జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఆరటి తొక్కకే సొంతం. వీటిని జుట్టుకు అప్లై చేసుకుంటే, జుట్టుకు కావాల్సిన పోషకాలు అంది జుట్టు ఒత్తుగా, నిగారింపుగా ఉంటుంది. అరటి తొక్కలు తినేందుకు అనుకూలమైనవి. వీటిని తింటే గుండె జబ్బులు మరియు ఇతర రోగాలను తట్టుకునే శక్తీ లభిస్తుంది. మలబద్దకం ఉన్నవారిలో అరటితొక్కను తింటే ఈ సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది, దీనిలో ఉండే పీచు పదార్ధాలు జీర్ణ ప్రక్రియ మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఎముకులు గట్టిబడటానికి, కంటి ఆరోగ్యం మెరుగుపరచడానికి అరటి తొక్కలు ఎంతో సహాయం చేస్తాయి. వీటిని తినే ముందు మీ వైద్యులను లేదా ఆహార నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More