ప్రస్తుతం కార్లు మరియు బైకుల వినియోగం చాలా పెరిపోయి రోడ్డు మీద సైకిల్ కనిపించని పరిస్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ మీద వెళ్లే సమయంలోనే మనిషి ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు కారులు మరియు బైకుల సౌలభ్యం వచ్చి మనిషిలో బద్ధకం పెరిగిపోయింది, సౌకర్యవంతమైన జీవితంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. ఎక్కువవుతున్న కార్లు మరియు బైకుల వినియోగం వలన పర్యావరణం కలుషితం అవుతుంది, దీని ఫలితం పోయిన ఏడాది సర్రిగా వర్షాలు లేకపోవడం మరియు ఈ ఏడాది అధికంగా నమోదయిన ఉష్ణోగ్రతల రూపంలో అనుభవిస్తున్నాం.
అదే సైకిల్ సహాయంతో ప్రయాణం చేస్తే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఏడాదికి లక్షల్లో డబ్బును ఆదా చెయ్యవచు. సైకిల్ మీద 5-7 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. భారత దేశంలో నిర్వహించిన కొన్ని సర్వేల ఆధారంగా కాలేజీలు మరియు ఆఫీసులకు వెళ్లేవారు ప్రతిరోజు సైకిల్ మీదే వెళితే కొన్ని లక్షల రూపాయిలు ఆదా అవుతాయని పేర్కొంది. ఒక నివేదిక ప్రకారం భారతీయులంతా కేవలం సైకిల్ మీద మాత్రమే ప్రయాణించాలి అని అనుకుంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్లు ఆదా చెయ్యవచ్చట, దీని ద్వారా జిడిపి లో 1.6 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే వాస్తవానికి ఇది సాధ్యం కాకపోయినా బైకులు మరియు కార్ల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు ప్రజారవాణా పై ఆధారపడవల్సి ఉంటుంది.
ఒక దశాబ్ద కాలంలో ఇందనముతో నడిచే వాహనాల సంఖ్యా 10% వరకు పెరిగిపోయింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సైకిల్ వినియోగం స్తంభిస్తుంది. 1954లో 57 మంది భారతీయులు సైకిళ్లనే వాడేవారు, సుదూరప్రాంతాలకు కూడా సైకిల్లనే ఎక్కువుగా ఉపయోగించేవారు. అయితే కాలం మారుతూ వస్తున్న కొద్దీ ప్రజల జీవినశైలిలో మార్పు వచ్చి కార్లు మరియు బైకుల వినియోగం పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులను సైకిల్ తొక్కేందుకు ప్రోత్సహించడం కాస్త కఠినతరమే అయినప్పటికీ ప్రజల ఆలోచనలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కనీసం తక్కువ దూరం ప్రయాణానికైనా సైకిల్ ఉపయోగిస్తే ఎన్నో రోగులను కట్టడి చెయ్యవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. సైకిల్ ప్రయాణికుల కోసం రోడ్డుకు ఇరువైపులా ట్రాక్స్ ఏర్పాటు చేస్తే కొంతమేరకైనా సైకిల్ వినియోగదారులు పెరుగుతారని టెరాయ్ సంస్థ పేర్కొంది.
Share your comments