Health & Lifestyle

ఉదయాన్నే మునగాకు నీటిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు....

KJ Staff
KJ Staff

ముల్లకాడలతో వంటకాలు చేసుకొని తింటారన్న విష్యం అందిరికి తెలుసు, కానీ మునగ ఆకులతో కూడా అనేక రకాల రకాల వంటకాలు చేసుకోవచ్చు అన్న విష్యం మనలో కొద్దీ మందికి మాత్రమే తెలుసు. మునగాకుతో వంటకాలు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, భారత దేశం మొత్తం చేసుకుంటారు. మన ప్రధాని మోడీ, కూడా ఆయనకు మునగాకుతో చేసిన పరోటా అంటే ఇష్టమని ఒకానొక సందర్భంలో తెలియచేసారు. మునగాకులో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. ముఖ్యంగా కళ్ళ సమస్యలతో బాధ పడేవారికి మునగాకులు ఒక దివ్యౌషధంలాగా పనిచేస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు మునగాకు నీటిని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

మునగ ఆకులని సూపర్ ఫుడ్ గా పరిగణించవచ్చు. శరీరానికి అవసరమైన అన్ని పోషకవిలువలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా మునగ ఆకులు మనకు సంవత్సరం పొడవునా లభిస్తాయి. మునగ చెట్లను పెంచడం కూడా చాల సులభం. మునగ చెట్ల ఆకులు, కాయలు, పూలు, మరియు వేర్లు ఇలా అన్ని భాగాలూ ఉపయోగకారమే. వీటిలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్స్ ఏ, సి, ఈ, తోపాటు పొటాషియం మరియు కాల్షియమ్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియమ్ ఎముకల దృఢత్వానికి అత్యంత కీలకం.

మునగ ఆకుల్లో, క్లోరోజెనిక్ ఆసిడ్ మరియు క్యూరిసితిన్ అనే రెండు ఆమ్లాలు ఉంటాయి, ఇవి దీర్ఘకాలిక వ్యాధులైన గుండె మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో తోడ్పడతాయి. మునగ ఆకుల నీటిని ప్రతిరోజు తాగడం చేత ఈ వ్యాధులు మన దగ్గరికి చేరనియ్యకుండా, కాపాడుతుంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు, మునగాకుల నీటిని తాగడం చేత, శరీరంలో ఇంఫ్లమేషన్ తగ్గి, కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

మునగ ఆకులకి ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదంలో చెప్పిన విధంగా వాత, కఫ, పీత వంటి రోగాలను నయం చెయ్యగల లక్షణం మునగ ఆకులకు ఉంది. పరగడుపున మునగ ఆకులతో చేసిన నీటిని తాగడం వలన, శరీరంలో ఉండే మలినాలు శుభ్రమవుతాయి, అంతేకాకుండా రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రణలో ఉంచడంలోనూ తోడ్పడుతుంది. దీనితో పాటు శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందుతుంది.

 

Share your comments

Subscribe Magazine