Health & Lifestyle

వెల్లుల్లిని ఈ విధంగా తింటే బోలెడన్ని ప్రయోజనాలు...

KJ Staff
KJ Staff

మనం తరచూ తినే మసాలా వంటకాల్లో వెల్లులి ఒక భాగం. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెల్లులి రుచి చాల వైవిధ్యంగా ఉంటుంది కనుక దీనిని తినడానికి మక్కువ చూపారు. అయితే వెల్లుల్లి తినడం ద్వారా ఎన్నో రోగాలు నయమవుతాయి.వెల్లులిని తినే సమయంబట్టి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి పడుకునేముందు వెల్లులిని తినడం శరీరానికి ఎంత మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారాలన్నీ రుచిగా ఉండవు, అలాగే రుచిగా ఉండే ఆహారాల్ని ఆరోగ్యకరమైనవి కావు. వెల్లుల్లి పచ్చివి తిన్నపుడు ఈ మాట నిజమనిపిస్తుంది. వెల్లుల్లి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నా పచ్చిగా తినాలంటే చాల కష్టంగా ఉంటుంది. తినగా తినగా వేప తియ్యగా మారుతుందనట్లు వెల్లుల్లి రుచి కూడా అలవాటైపోతుంది. దీనిలో ఎన్నో అద్భుత గుణాలున్నాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పోషకం యాంటీమైక్రోబియల్, యాంటీఫంగల్ యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల తరచూ వచ్చే రుగ్మతుల నుండి విముక్తి లభించడమే కాకుండా శరీరంలో ఇమ్మ్యూనిటి పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని తినడం వలన రోగనిరోధక శక్తీ పెరిగి, ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.


వెల్లుల్లి తినడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతాయి మరియు రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వు తొలగించబడుతుంది. దీని వలన గుండె పనితీరు పెరిగి, గుండె ఆరోగ్యం పెంపొందించబడుతుంది. వెల్లుల్లిని తినడం ద్వారా లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ అని పిలవబడే కాన్సర్ కారకాలను నిర్ములిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ డిఎన్ఏ నిర్మాణంలో మార్పులు చేసి క్యాన్సర్ వ్యాధికి దారితీస్తాయి.

రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తినడం వలన శరీరానికి సహజసిధమైన కాంతి లభిస్తుంది, శరీరంలో సెల్ డ్యామేజ్ తగ్గించి, వృధ్యాప ప్రక్రియను తగ్గిస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లి సహజమైన క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేసి శరీరంలోని చెడును బయటకు పంపుతుంది, అంతే కాకుండా చెడు కొవ్వు శాతం తగ్గడం వలన బరువు కూడా తగ్గేందుకు వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More